దిశ చట్టంని దేశ వ్యాప్తంగా తీసుకురండి - మోడికి లేఖలో స్వాతి మలివాల్

By Krishna Babu Dec. 15, 2019, 06:40 am IST
దిశ చట్టంని దేశ వ్యాప్తంగా తీసుకురండి - మోడికి లేఖలో స్వాతి మలివాల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ప్రవేశ పెట్టిన "దిశ బిల్" సహాసోపేత నిర్ణయంగా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ కూడా మొదలైంది. గత 12 రోజులుగా అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న డిల్లీ మహిళా కమీషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేయ్యాలని ప్రధాని మొడికి లేఖ రాశారు. తెలంగాణలో దిశ అత్యాచార ఘటనను ఖండిస్తూ డిసెంబర్ 3న ఆమరణ నిరాహార దీక్ష చెపట్టిన స్వాతి మలివాల్ తొలుత నేరం జరిగిన ఆరు నెలల్లో అత్యాచారంకి పాల్పడిన వారికి ఉరిశిక్ష పడేలా చేయ్యాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ బిల్లులో, అత్యాచార కేసు నమోదైనా, 14 రోజుల్లో విచారణ, దర్యాప్తు పూర్తి చేసి సరైన సాక్ష్యాదారాలు ఉంటే నిందితులకు కేసు నమొదైనప్పటి నుంచి 21రోజుల్లో శిక్ష అమలు చెయ్యాల్సి ఉండగా. ఈ బిల్లుని సమర్దిస్తూ ఇలాంటి బిల్లు దేశ వ్యాప్తంగా అమలు చేయ్యలని ఆమే లేఖలో డిమాండ్ చేశారు. అంతే కాకుండా మహిళా భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖిరిపై కూడా ఆమే మండిపడ్డారు. ఈ బిల్లు దేశవ్యాప్తంగా అమలు అయ్యేవరకు తాను ఈ దీక్ష కోనసాగిస్తానని స్పష్టం చేశారు. అయితే వచ్చే జనవరిలో దిశ చట్టంపై జాతీయ స్థాయిలో మహిళా సదస్సు నిర్వహించడం ద్వారా కేంద్ర చట్టాలలోను మార్పులు తీసుకుని వచ్చేలా డిక్లరేషన్ విడుదల చెయునునట్లు ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp