13 రోజులుగా ఆమె పోరాటం

By Kotireddy Palukuri Dec. 16, 2019, 10:52 am IST
13 రోజులుగా ఆమె పోరాటం

దేశంలో జరుతున్న అత్యాచారాలపై ఆమె గళం విప్పింది. ఆ గళానికి ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడంతో ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. రేప్ చేసిన నిందితులపై విచారణ పూర్తి చేసి ఆరు నెలల్లోపు శిక్ష విధానించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నిర్భయ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నదే ఆమె డిమాండ్. 2012లో ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన దోషులను ఏడేళ్లు కావస్తున్నా నేటికీ శిక్షించలేదు.

ఈ అంశంపైనే స్వాతి మలివాల్ ఉద్యమం మొదలు పెట్టారు. నిర్భయ చట్టం చేసిన మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగకపోవడానికి ప్రధాన కారణం శిక్షలు పడకపోవడమే. ఈ నేపథ్యంలోనే మలివాల్ నిర్భయ నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా అఘాయిత్యాలకు పాలపడిన వారికి 6 నెలల్లో శిక్ష విధించాలని పోరాటం చేస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన తర్వాత మలివాల్ తన ఉద్యమాన్ని ఉదృతం చేశారు. దిశ నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో నిందితులను శిక్షించాన్న డిమాండ్ తో ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 13 రోజులుగా ఆమె దీక్ష కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం క్షిణించింది. దీక్షా శిబిరంలో తీవ్ర అశ్వత్తతకు గురవడంతో అధికారులు ఆమెను లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp