సీఏఏ పై స్టేకు సుప్రీం నో !!

By Nehru.T Jan. 22, 2020, 03:21 pm IST
సీఏఏ పై స్టేకు సుప్రీం నో !!

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎలాగైనా అమలు చేయాలని పంతంతో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్,వామపక్షాలతోబాటు మమతా బెనర్జీ కూడా వ్యతిరేకిస్తున్నారు.

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీఏఏకి సంబంధించిన పిటిషన్లను విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఐదు వారాల తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

ఈ సీఏఏమీద నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశించింది. కేంద్రం తరపు న్యాయవాది వేణుగోపాల్‌ ఆరు వారాల సమయం కోరడంతో న్యాయవాది కపిల్‌ సిబల్‌ అభ్యంతరం తెలిపారు. అసోం, త్రిపుర పిటిషన్లను కలిపి వింటామన్న ధర్మాసనం.. వీటిపై సహకరించాల్సిందిగా కపిల్ సిబల్‌ను కోరింది. కాగా కేంద్ర ప్రభుత్వంతో పాటు మొత్తం పిటిషనర్లందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఏఏపై మున్ముందు సుప్రీంకోర్టులో విచారణ కోరదల్చుకున్న అన్ని అంశాలను సమర్పించాలని ఆదేశించింది. కాగా సీఏఏపై ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలూ జారీ చేయరాదంటూ ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు సూచించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp