నాడు వైఎస్‌.. నేడు జగన్‌.. ఇద్దరూ ఇద్దరే

By Karthik P Jul. 28, 2021, 01:30 pm IST
నాడు వైఎస్‌.. నేడు జగన్‌.. ఇద్దరూ ఇద్దరే

విద్యతోనే బతుకులు మారాతాయని నమ్మే నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. పేదరికం నుంచి బయటపడేందుకు ఉన్న ఏకైక మార్గం చదువు ఒక్కటేనని చెప్పిన వైఎస్‌.. కులాలు, మతాలకు అతీతంగా పేద కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదివేలా ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం పెట్టారు. పేదరికానికి రేషన్‌ కార్డునే కొలమానంగా తీసుకుని ఈ పథకం అమలు చేసి ప్రజల హృదయాల్లో దేవుడుగా కొలువయ్యారు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు. వైఎస్‌ఆర్‌ సిద్ధాంతాన్నే నమ్మిన జగన్‌.. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను అందిపుచ్చుకుని, పోటీ ప్రపంచంలో రాణించేలా విద్యార్థుల భవిష్యత్‌కు వైఎస్‌ జగన్‌ బంగారు బాటలు వేస్తున్నారు.

విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు..

పుస్తకాల ద్వారా నేర్చుకున్న విజ్ఞానాన్ని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడం ఎంతో అవసరం. అంతేకాకుండా పాఠశాలలో బోధించని అంశాలను తెలుసుకోవడం ముఖ్యమైన అంశం. ఈ రెండు చేస్తేనే మంచి కొలువులు దక్కుతాయి. అయితే విద్యార్థులు ఈ దిశగా నేర్చుకోవాలంటే వారికి ల్యాప్‌ ట్యాప్‌ కావాలి. తాను అమలు చేస్తున్న పథకాల ద్వారా అవసరమైన విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు ఇచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా నగదు అందుకుంటున్న 9, 10, ఇంటర్‌ విద్యార్థులు కోరితే.. ల్యాప్‌ట్యాప్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఎంత మందికి ల్యాప్‌ల్యాప్‌లు అవసరమన్న సమాచారాన్ని సేకరించింది. జనవరిలో మూడో దఫా అమలు చేయబోయే అమ్మ ఒడి పథకంలో భాగంగా ఈ సారి కోరుకున్న విద్యార్థులు ల్యాప్‌ట్యాప్‌లు అందుకోబోతున్నారు.

ఉన్నత చదువుల వారికి కూడా..

అమ్మ ఒడి పథకం ద్వారా 9, 10, ఇంటర్‌ విద్యార్థులకే కాదు.. ఉన్నత చదువులు అభ్యసిస్తున్న వారికి కూడా ల్యాప్‌ట్యాప్‌ ఇవ్వాలని జగన్‌సర్కార్‌ నిర్ణయించింది. డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న వారికి ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకంతోపాటు వారి హాస్టల్‌ ఖర్చు కోసం ఏడాదికి 15 నుంచి 20 వేల రూపాయల నగదును అందిస్తోంది. జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా నగదుకు బదులు ల్యాప్‌ట్యాప్‌లు కావాలనుకుంటున్న విద్యార్థులకు ఆ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. నగదు వద్దు ల్యాప్‌ట్యాప్‌కావాలనుకున్న వారికి ఈ ఏడాది నుంచి ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వాబోతున్నారు. బేసిక్‌ మోడల్, అడ్వాన్స్‌ కాన్ఫిగరేషన్‌తో కూడిన రెండు రకాల ల్యాప్‌ట్యాప్‌లు విద్యార్థులకు అందించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ల్యాప్‌ట్యాప్‌లలో ఏదైనా సమస్య వస్తే.. గ్రామ సచివాలయాలు వారం రోజుల్లోనే పరిష్కరిస్తాయి. ఈ అవకాశం వల్ల.. ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారికి ఎంతో ప్రయోజనం చేకూరబోతోంది.

Also Read : చంద్రబాబు, కేసీఆర్, జగన్.. ఓ ఉప ఎన్నిక

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp