స్పీకరే వాకౌట్..

By Sridhar Reddy Challa Jan. 21, 2020, 12:10 pm IST
స్పీకరే వాకౌట్..

ఈ ఉదయం అసెంబ్లీలో ఎస్సి ఎస్టీ బిల్లుని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఆమోదించకుండా వెనక్కి పంపడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వైసిపి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ అంశం పై మాట్లాడుతున్న సమయంలో టిడిపి సభ్యులు పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. స్పీకర్ ఎంత వారించినా వినకుండా మాటిమాటికి సభకు అడ్డు తగలడంతో.. టీడీపీ సభ్యుల తీరుతో విసిగిపోయిన స్పీకర్.. తీవ్ర మనస్థాపానికి గురయ్యానని, సభ్యుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నానని ఆగ్రహంతో తన మైకు ని విసిరికొట్టి సభ నుండి బయటకి వెళ్లిపోయారు. దీంతో సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది.

Read Also: అమరావతి - మాణిక్య వరప్రసాద్ రాజీనామా

విపక్షాలకు సమయం ఇచ్చినప్పటికీ వారు దానిని దుర్వినియోగం చేస్తూ మాటిమాటికి స్పీకర్ పోడియాన్ని ముట్టడించి నినాదాలు చేస్తుండడం, సభ జరుగుతున్న సమయంలో వ్యక్తి గత కామెంట్లు చేస్తుండడంతో విపక్ష సభ్యులు తీరుతో స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తుంది.

నిన్న ఉదయం సభ ప్రారంభం అయినప్పుడు కూడా స్పీకర్ గుడ్ మార్నింగ్ అంటూ సభ్యులను పలకరించడంతో, ప్రతిగా చంద్రబాబు వెరీ బ్యాడ్ మార్నింగ్ అని సంబోదించడంతో స్పీకర్ ప్రతి పక్ష నేత తీరుపై మీరు ఎప్పటికి మీ తీరు మార్చుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో కూడా స్పీకర్ విపక్ష సభ్యుల తీరుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుండి బయటకి వెళ్లిన ఘటన చూశాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp