సీఎం జగన్ తో భేటీ అయిన స్టీల్‌ సంస్థ ప్రతినిధులు

By Krishna Babu Oct. 29, 2020, 06:12 pm IST
సీఎం జగన్ తో భేటీ అయిన స్టీల్‌ సంస్థ ప్రతినిధులు

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్ తో ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ప్రముఖ స్టీల్‌ ఉత్పత్తి సంస్థ కొరియాకు చెందిన ‘‘పోస్కో’’ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గత ఏడాది జూన్ నెలలో సీఎం జగన్ ను కలిసిన కంపెనీ సీఈవో బాంగ్‌ గిల్‌ రాష్ట్రంలో ఉక్కు ప్లాంటు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే పోస్కో సాంకేతిక బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని చెప్పి వెళ్ళారు. దానికి కోనసాగింపుగా నేడు తిరిగి ముఖ్యమంత్రిని సంస్థ ప్రతినిధులు కలిసినట్టు తెలుస్తుంది.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్నారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమలకు తోడ్పాటు నందిస్తాయన్నారు. పారిశ్రామికాభివృద్ధికీ ఉపకరిస్తాయన్నారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ తదితరులు ఉన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp