వీర్రాజు గారి చంద్రబాబు ఉతుకుడు.....

By Nehru.T Feb. 14, 2020, 07:44 pm IST
వీర్రాజు గారి చంద్రబాబు ఉతుకుడు.....

ఆకాశవాణి విశాపట్నం కేంద్రం..వార్తలు చదువుతున్నది అప్పలకొండ...బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టిడిపి నాయకులమీద విరుచుకు పడ్డారు...సారీ..కాదు.. కాదు...టిడిపి నాయకుల తుప్పురేగ్గొట్టారు ..చంద్రబాబు నాయుడుని, లోకేష్, ఇంకా యనమల రామకృష్ణులను వేర్వేరుగా చాకిరేవు బండకేసి బాది బాది ఉతికేశారు...ట్రిపుల్ ఎక్స్ వారి సంస్కారవంతమైన సబ్బును వాడినట్లున్నారు ..మొత్తానికి పధ్ధతిగానే దులిపేశారు...ఆయన ఏమన్నారో చూద్దాం పదండి...

చంద్రబాబు అవినీతిని తవ్వడానికి బుల్‌డోజర్లు కావాలి

 – గత ప్రభుత్వంలో ట్రేడింగ్‌ జరిగింది. అవినీతి జరిగింది.
– పోలవరం కుడి, ఎడమ కాలువల్లో మిగిలిపోయిన పనుల కోసం ఒక ప్యాకేజ్‌గా ప్రారంభించారు. దాని విలువ రూ.15 కోట్లు. వీళ్లు మాత్రం రూ.90 కోట్లకు పెంచి పనులు చేశారు.
– చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తవ్వడానికి గునపాలు చాలవు.. బుల్‌డోజర్లు కావాలి.
– ఇప్పుడే పని ప్రారంభమయింది. ఏ డోజర్లు కావాలో మనం చూడాలి.
– అవినీతిని ఎలా చేయాలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలిసినంతగా భారతదేశంలో ఎవరికీ తెలీదు.
– చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్, చినబాబు స్నేహితులు, కొంత మంది మాజీ మంత్రుల పుత్రరత్నాల ద్వారా ఒక చిన్న కుంభకోణం బయటపడింది.
– దీని విలువ రూ.2 వేల కోట్లు. దీన్ని బాగా స్టడీ చేస్తే ఇది ఎన్ని వేల కోట్లకు వెళుతుందనే అంచనా ఊహలకందదు.
– దీన్ని రకరకాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్లు ఖండిస్తున్నారు. శ్రీనివాస్‌కు, తెలుగుదేశానికీ సంబంధం ఎంటని అంటున్నారు.
– సంబంధం లేకుండా పీఎస్‌ ఇంట్లో ఇంత డబ్బు ఎలా దొరుకుతుంది. ఇన్ని లాకర్స్‌కు సీల్‌ వేయడమేంటి?
– పీఎస్‌ శ్రీనివాస్‌ సత్యహరిశ్చంద్రుడైతే చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ల సహాయం లేకుండా ఇన్ని లాకర్లకు సీల్‌ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది.
– PS (Personal Secretary )అంటే ఎంటి? గేటు దగ్గర ఉండాల్సినోడు, సీఎంతో ఉండాల్సినోడు. సీఎంతో సంబంధం లేకుండా ఆయన దగ్గర రూ.2వేల కోట్లు ఎలా వచ్చింది.
– దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇన్‌కంటాక్స్‌ సంస్థ బయటపెట్టింది. రూ.2 వేల కోట్లకు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా చేతులు మారినాయి.
– ఈ చేతులు మారడంలో ఎలాంటి కంపెనీలున్నాయి. ఈ రెండు కోట్ల కంపెనీలు సబ్‌ కాంట్రాక్టు కంపెనీలు. ఇవి డొల్ల కంపెనీలు.

నీరు– చెట్టు పనులపై రూ.25 వేల కోట్ల అవినీతి

– చంద్రబాబు హయాంలో జరిగిన నీరు– చెట్టు పనుల్లో రూ.25 వేల కోట్ల అవినీతి జరిగింది.
– స్వచ్ఛభారత్, గృహనిర్మాణశాఖలలో జరిగిన అవినీతిపై ఇప్పుడు విజిలెన్స్‌ ఎంక్వయిరీ జరుగుతోంది.
– చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా స్టడీ చేస్తున్నాయి.
పోలవరం పనులపై...

– ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి రూ.500 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చారు. దీన్ని ఇప్పటికి కూడా ప్రభుత్వం వెనక్కి రాబట్టలేకపోయింది.
– ఈ రూ.500 కోట్లు శ్రీనివాస్‌కు ఇచ్చిన సబ్‌కాంట్రాక్టు ద్వారా వెనక్కి వచ్చింది.
– పోలవరం లెఫ్ట్‌ కెనాల్‌లో 10 ప్యాకేజీలున్నాయి.వీటన్నింటినీ రూ.10 కోట్ల పనుల్ని రూ. 50 కోట్లు చేశారు.రూ.15 కోట్లుంటే రూ.75 కోట్లు చేశారు.

కుడి, ఎడమ కాలువల కాంట్రాక్టు ధరల్ని పెంచారు. ఆ పెంచడం ద్వారా వచ్చిన డబ్బు శ్రీనివాస్‌ ద్వారా బయటికి వెళ్లింది.
– రూ.4500 కోట్ల విలువైన పోలవరం పనులను రూ.5350 కోట్లు చేశారు. అంచనాలు పెంచగా వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్లింది.
– రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగింది.
– రాయలసీమ ప్రాజెక్టుల కాలువలు వెడల్పు చేశామని చెప్పారు. అసలు వెడల్పు చేయకుండానే బిల్లులు డ్రా చేశారు. దీని విలువ రూ.5 వేల కోట్లు.
– ఈ పనులు జరిగి ఉంటే.. ఈ మధ్య కురిసిన వర్షాలకు రాయలసీమ సస్యశ్యామలమయి ఉండేది.
– ఉపాధి హామీ పథకం కింద ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఇచ్చింది. ఈ పనుల్లో లెక్కలేనంత అవినీతి జరిగింది. రూ.1 కోటితో పనులు జరగాలంటే రూ.40 లక్షల్లో పనులు చేసేవారు.
– ఈ డబ్బంతా శ్రీనివాస్‌ ద్వారానే కాకుండా.. పెద్దపెద్ద తిమింగలాల ద్వారా బయటకు వెళ్లింది.
–– జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత పోలవరం, హైడ్రోపవర్‌ జనరేషన్‌ పనులను కలిపి ఒక్క ప్యాకేజీ కింద టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో రూ.800 కోట్లు తక్కువ కోట్‌ చేశారు.

అమరావతి పనుల్లో ఏమి జరిగిందంటే...

– చదరపు మీటర్‌కు రూ.10 వేలు ఖర్చు చేశారు. శాసనమండలిలో యూరినల్‌కు వెళితే పక్కన ఉన్న వ్యక్తి తగులుతుంటాడు. పై నుంచి నీళ్లు కారుతుంటాయి.
– ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఇలానా రాజధాని భవనాల్ని కట్టేది. అది తాత్కాలిక రాజధాని.
– 1996లో వాజ్‌పేయి ప్రభుత్వానికి చంద్రబాబు నాయడు మద్దతు ఇవ్వలేదు. 1998లో మద్దతు ఇచ్చాడు.
2004 వరకు వాజ్‌పేయి, అద్వానిని ఎంత పిసకాలో అంతా పిసికేశాడు. వాళ్ల మనుషులను అన్ని చోట్లా పెట్టేశాడు.
వేవి చిన్న విషయాలు కాదు. దేశం సర్వనాశనం అయ్యే విషయాలు.
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన అవినీతి చక్రవర్తి.

యనయల రామకృష్ణుడు తక్కువోడు కాదు...

– ఎన్టీరామారావు కుమారుడు రామకృష్ణ చనిపోయారు. దీంతో ఎన్టీరామారావు, ఆయన భార్య బసవతాకంలు యనమల రామకృష్ణుడిని వాళ్ల కుమారుడిగా చూసుకున్నారు.
– ఈయనకు రోజు భోజనం కూడా పెట్టేవారు. సీటిచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి.. స్పీకర్‌గా చేశారు.
– అంతా చేస్తే చంద్రబాబుతో కలిసి కుట్రపన్నారు. ఎన్టీయార్‌ను పదవీచ్యుతున్ని చేశారు.
– యనమల రామకృష్ణుడు సింగపూర్‌ వెళ్లి పన్నుకు రూట్‌ కెనాల్‌ చేయించుకున్నందుకు రూ.6 లక్షల ప్రభుత్వ డబ్బును డ్రా చేసుకున్నాడు.
– పోలవరం కెనాల్‌ పనుల్లో జరిగిన అవినీతిలో యనమల రామకృష్ణుడి వియ్యంకుడి భాగస్వామ్యం కూడా ఉంది.
– ఎన్ని తప్పులు చేసినా చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని తప్పించుకోవచ్చని యనమల ప్రగాఢ విశ్వాసం. వాళ్ల మనుషులు ఉండటం వల్ల తీర్పు కూడా వాళ్లు అనుకుంన్నట్లు వస్తుంది.
– ఆ ధైర్యంతోనే ఎమైనా మాట్లాడుతారు యనమల రామకృష్ణుడు.
– లోకేశ్‌ మంత్రి వర్గంలోకి రావడం వల్ల తన ప్రాభవం తగ్గిందని.. యనమలకు లోకేశ్‌పై కోపం ఉంది.

చిన్నబాబు ద్వారానే శ్రీనివాస్‌.. చంద్రబాబు పీఎస్‌ అయ్యారు...

– 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత యనమల, కొంత మంది బాబుల హవా ఉండేది.
– ఎప్పుడైతే చిన్నబాబు వచ్చారో.. ఆ బాబులందరూ దిల్లీ వెళ్లిపోయారు. లోకేశ్‌ ఎంట్రీతోటే శ్రీనివాస్‌ కూడా వచ్చాడు.
– ఇన్‌కంటాక్స్‌ చేపట్టిన తనిఖీల్లో మంత్రుల పుత్రరత్నాలు, చిన్నబాబు స్నేహితులే దొరుకుతున్నారు.
– ప్రభుత్వంలో జరిగిన వ్యవహారం అంతా శ్రీనివాస్‌తోనే నడిచింది.
– ఎవరు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లారు, దానికి సంబంధించిన ట్రేడింగ్‌ ఎంత అనేది.. మంత్రుల కొడుకులు, చిన్నబాబు, శ్రీనివాస్‌ అందరూ కలిసి చర్చించుకునేవారు.
– ఏరోజు ఎంత వచ్చింది.. అనే దానిపైనే ఎక్కువ భాగం చర్చించుకునేవారు.

ఇది ఇక్కడితో ఆగదు..

– ఈ డొంక చాలా వరకు వెళ్తుంది. అంత ఈజీగా వదిలేస్తారు అనుకోవద్దు. భారత రాజకీయాలకు సవాల్‌ ఇది. దేశాన్ని మోసం చేసే ఇలాంటి వ్యక్తుల గురించి బీజేపీ చాలా గట్టిగా ఉంటుంది. అది మా బాధ్యత.
– దేశ అభివృద్ధికి విఘాతం కలిగించే శక్తులు ఇవి. వీళ్ల వెనకాల చాలా కుట్రలుంటాయి. వాళ్ల బాగుకోసం దేశాన్ని ఎక్కడైనా తకట్టు పెట్టే వ్యక్తిత్వం వాళ్ల సొంతం.
– ఆయన హిస్టరీని పరిశీలిస్తే ఇది తెలుస్తుంది. కాంగ్రెస్‌ వల్ల రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరిని పిల్లను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఎవరిని చేసుకున్నారు.
– ఎన్టీయార్‌ మీద పోటీ చేస్తామని చెప్పి.. అదే ఎన్టీయార్‌ పెట్టిన పార్టీలోకి వచ్చారు. అదే ఎన్టీయార్‌ను దించేసిన హిస్టరీని గమనించాలి. ఇది సమాన్య విషయం కాదు.
– ప్రభుత్వంలో ఉండే పెద్దలకి , చట్టాల్లో ఉండే పెద్దలకి, చట్టాలకి సవాల్‌ విసిరేటటువంటి వ్యక్తులు వీళ్లు.

లోకేశ్‌ను ఇలా ఉతికి ఆరేశారు...

– ఆంధ్రప్రదేశ్‌కు ఈ గతి పట్టడానికి ప్రధాన కారణం లోకేశే. మంగళగిరి పలకలేనటువంటి తింగరి మంగళం కాదు లోకేశ్‌ బాబు.
– ఐటీ దాడులు.. వైఎస్సార్‌సీపీకి.. లోకేశ్‌ బాబుకు సంబంధించిన విషయం కాదు.

ఒక అవినీతి పరుడికి.. భారత ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది.
– ఐటీ శాఖ ఎంత డబ్బు, ఎన్ని లాకర్లు సీల్‌ చేశారు అనే అంశాన్ని కూడా ప్రెస్‌నోట్‌లో ప్రస్తావించారు.
– ఈ విషయంపై లోకేశ్‌ తేలిగ్గా మాట్లాడుతున్నారు.

వార్తలు ఇంతటితో సమాప్తం .. నమస్కారం ..
మీ...అప్పలకొండ...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp