సోషల్‌ మీడియా వార్‌.. జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడేందుకు దారితీస్తుందా..?

By Venkat G Sep. 25, 2021, 03:30 pm IST
సోషల్‌ మీడియా వార్‌.. జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడేందుకు దారితీస్తుందా..?

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి రాష్ట్ర పార్టీ నాయకుల నుంచి మద్దతు రావడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. పార్టీలో కీలకంగా వ్యవహరించే వారు రేవంత్ కు అసలు కనీస సమాధానం కూడా ఇవ్వడం లేదనే ప్రచారం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డి ఆధిపత్యం నచ్చక కొందరు కాంగ్రెస్ నేతలు అధికార పార్టీకి సహకరిస్తున్నారు అనే కామెంట్స్ కూడా వింటున్నాం. ఇక కోవర్ట్ లు అని భావించిన వారిని రేవంత్ పక్కన పెడుతున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి.

అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు జగ్గారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా పరిస్థితి మారింది. రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వడాన్ని జగ్గారెడ్డి ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు అనే కామెంట్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో జగ్గారెడ్డి అభిమానులు ఘాటుగానే రేవంత్ ని విమర్శిస్తున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం లో జగ్గారెడ్డి రేవంత్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇది కాంగ్రెస్ పార్టీ నా...ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అని నిలదీస్తూ చర్చ లేకుండానే... రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారు అని ప్రశ్నించారు.

Also Read : పోచారం వారసత్వం కోసం కుమారుల మధ్య పోరు

జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయం కనీసం గీత రెడ్డీ కి సమాచారం ఇవ్వరా అంటూ రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా కి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నాకే సమాచారం ఇవ్వారా అని ఆయన నిలదీశారు. కనీస ప్రోటో కాల్ పాటించాలి కదా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ లో ఏ ఒక్కరో హీరో కాలేరు అన్నారు. ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి అభిమానులు జగ్గారెడ్డి ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలపై యూట్యూబ్ చానెల్స్ గాని ఆయన ఫాలోయర్స్ అసభ్య పదాలు వాడిన, తిట్టిన, నెగటివ్ గా మాట్లాడినా సంగారెడ్డి సహా రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు నా ఫాలోయర్స్ కూడా అదే తరహాలో స్పందించండి అని సూచించారు.

రేవంత్ రెడ్డి ఫాలోయర్స్ ఎలా కౌంటర్ ఇస్తే అలాగే కౌంటర్ ఇవ్వండి అని అన్నారు. అదే తరహాలో తిట్టండి అని పిలుపునిచ్చారు. తిట్టిన వారి అడ్రస్ లు సేకరించండి అన్నారు. దీని ఎవరు ఈజీ గా తీసుకోకండి అని ఇది జగ్గారెడ్డి అభిమానులకు, ఫాలోయర్స్ కి చేస్తున్న సూచన అంటూ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసారు. దీనితో ఇద్దరి మధ్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక జగ్గారెడ్డి పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది.

Also Read : కెసిఆర్ మీద పోరాటం చేస్తారు సరే,ఆ 19 పార్టీల పేర్లన్నా తెలుసా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp