కొత్త అవతారం ఎత్తనున్న శశిథరూర్

By Kiran.G 15-11-2019 07:03 AM
కొత్త అవతారం ఎత్తనున్న శశిథరూర్

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ కొత్త అవతారంలో కనిపించనున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమయ్యే ‘వన్‌ మైక్‌ స్టాండ్‌’ అనే కామెడీ కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ స్టాండప్‌ షోలో మొత్తం ఐదుగురు సెలెబ్రెటీలు మరో ఐదుగురు ప్రొఫెషనల్‌ కమెడియన్స్‌తో పోటీపడనున్నారు. ఇందులో భాగంగా శశిథరూర్‌ ప్రముఖ స్టాండప్ కమెడియన్‌ కునాల్‌ కమ్రాతో జట్టు కట్టనున్నారు. సెలెబ్రిటీ జాబితాలో హీరోయిన్లు తాప్సీ, రిచా చద్దా, గాయకుడు విశాల్‌ దద్లాని ఉన్నారు. స్టాండప్‌ కమెడియన్స్‌ జాబితాలో సపన్ వర్మ, రోహన్‌ జోషి వంటి వారు ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించి నిమిషం నిడివి ఉన్న వీడియోను ఆయన తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో శశి థరూర్‌ తను మాట్లాడే ఆంగ్లం గురించి, తను ఉపయోగించే కష్టమైన పదాల గురించి జోకులు వేస్తూ సరదాగా కనిపించారు. ‘‘నేను ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని ఉన్నదాని కంటే ఎక్కువగా చేసి చూస్తారు. అందరిలానే నా బాల్యం కూడా సాధారణంగా గడిచింది. మా ఇంటికి వచ్చే అతిథుల నుంచి ఆంగ్లం నేర్చుకోవాలని నా తల్లిదండ్రులు నన్ను తరచూ ఇబ్బందిపెట్టేవారు’’ అని ఆ వీడియోలో శశిథరూర్ వ్యాఖ్యానించారు.

నవంబరు 15 నుంచి దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఈ వీడియోను చూసి ఆయన అభిమానులు, నెటిజన్లు శశి థరూర్‌ హాస్య చతురతను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News