ముఖ్యమంత్రి నిర్ణయంతో సీమలో సంబరాలు

By Naveen Malya Jan. 21, 2020, 07:31 am IST
ముఖ్యమంత్రి నిర్ణయంతో సీమలో సంబరాలు

రాయ‌ల‌సీమ‌లో హైకోర్టు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యంతో్ రాయ‌ల‌సీమ వాసుల ఆనందానికి అవ‌ధుల్లేవు. మూడు రాజ‌ధానుల బిల్లు అసెంబ్లీ ఆమోదం తెలుప‌డంతో సీమ ప్ర‌జ‌లు సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

రాయ‌ల‌సీమ వ్యాప్తంగా వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు వై.ఎస్ జ‌గ‌న్‌కు పాల‌భాషేకాలు చేస్తున్నారు. కర్నూలును జూడిషియల్ క్యాపిటల్‌గా ప్ర‌క‌టించ‌డంతో కర్నూలు వైఎస్పార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని కొండారెడ్డి బురుజు వద్ద మిఠాయిలు పంపిణీ చేస్తూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తేర్నకల్ సురేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్థన్ రెడ్డి, ఇత‌ర నేతల పాల్గొన్నారు. ఇక న్యాయ‌వాదులు, లెక్చ‌రర్లు, విద్యార్థి యువ‌జన సంఘాల నాయ‌కులు త‌మ స్పంద‌న తెలియ‌జేశారు. రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు పెట్ట‌డాన్ని తామంతా స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పారు.

Read Also: రాత్రి 11 గంటల వరకు సభ.. రెండు బిల్లులకు ఆమోదం

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక పులివెందుల‌లోని పూల అంగ‌ళ్ల స‌ర్కిల్‌లో నేత‌లు సంబ‌రాలు చేసుకున్నారు. అనంత‌పురం జిల్లా హిందూపురంలో వైసీపీ ఆద్వ‌ర్యంలో ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల బిల్లు ఆమోదించడంపై కదిరిలో పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.

Read Also: చేతులెత్తి వేడుకుంటున్నా.. చంద్రబాబు

ఇక అనంత‌పురంలో ఓ వైపు విద్యార్థి యువ‌జ‌న సంఘాలు సంబ‌రాలు చేసుకుంటుంటే టిడిపి నేత‌లు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంత‌రం పోలీసులు ప‌లువురు టిడిపి నేత‌లను అరెస్టు చేశారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం అభివృద్ధి చెయ్య‌దు...చేస్తున్న వారికి అడ్డుత‌గులుతోంద‌ని మండిప‌డ్డారు. ఇక క‌ర్నూలులో సైతం టిడిపి నేత‌లు ఆ పార్టీ కార్యాల‌యం ఎదుట మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌ట్టారు. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉండాల‌ని నినాదాలు చేశారు. అనంత‌రం విద్యార్థి యువ‌జ‌న సంఘల జేఏసీ, న్యాయ‌వాదుల జేఏసీ ఆద్వ‌ర్యంలో అదే టిడిపి కార్యాల‌యం ఎదుట సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ సంబ‌రాలు చేసుకున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp