బోయినపల్లి కిడ్నాప్ కేస్ - కోర్టులో అఖిలప్రియకు చుక్కెదురు

By Rishi K Jan. 18, 2021, 03:46 pm IST
బోయినపల్లి కిడ్నాప్ కేస్ - కోర్టులో అఖిలప్రియకు చుక్కెదురు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రిటర్న్ చేసింది.

వివరాల్లోకి వెళితే హఫీజ్ పేట భూవివాదం కారణంగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియ,ఆమె భర్త భార్గవ్ రామ్, కేవీ సుబ్బారెడ్డి ప్రవీణ్ రావు సోదరుల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సినీ ఫక్కీలో ఐటీ అధికారులమంటూ ప్రవీణ్ రావు సోదరులను కొందరు కిడ్నాప్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం చెలరేగింది. విచారణలో మాజీ మంత్రి అఖిల ప్రియ సహా ఆమె భర్త భార్గవ్ రామ్, కేవీ సుబ్బారెడ్డిని నిందితులుగా పోలీసులు తేల్చారు. అఖిలప్రియను చంచల్ గూడ జైలుకు తరలించారు.

అఖిలప్రియ ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆమె తరుపున లాయర్ కోరినా అఖిల ప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు మెమో దాఖలు చేశారు. దాంతో జీవితకాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు వ్యాఖ్యానిస్తూ అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను రిటర్న్ చేసింది. దీంతో అఖిలప్రియ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. గతంలో కూడా అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp