SEB, East Godavari - షెహబాష్ సెబ్ ! ... గోదావరితీరంలో మార్పు !

By Voleti Divakar Dec. 05, 2021, 07:00 pm IST
SEB, East Godavari - షెహబాష్ సెబ్  ! ... గోదావరితీరంలో మార్పు !

తక్షణ ఎనర్జీ లాగ తక్షణ కిక్కు ఇస్తుంది నాటు సారా . తెల్లవారుజామునే కాఫీ తాగినట్లు దాన్ని తాగకపోతే సారాకు బానిసైన వారికి మనస్సు మనస్సులో ఉండదు . అయితే అది తయారుచేసే విధానాన్ని తెలుసుకుంటే ఎవరూ తాగరు . బ్యాటరీ పొడి , ఇతర ప్రమాదకర రసాయనాలతో తయారుచేసే సారాకు బానిసైన వారు అది లేకుండా ఉండలేరు . సారాకు బానిసైన వారి కుటుంబాల పరిస్థితి దయనీయం . రూపాయి పెట్టుబడితో రూ . 50 లాభం వచ్చే ఈవ్యాపారం రాష్ట్రవ్యాప్తంగా కోట్లపైనే సాగుతోంది .

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సారాను నిర్మూలించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి . గత ప్రభుత్వ హయాంలో సారా నియంత్రణకు చేపట్టిన కార్యక్రమాలు కూడా విఫలమయ్యాయి . గతంలో సారా బట్టీలపై ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో దాడులు జరిగేవి . ఊడలు దిగిన సారా వ్యాపారులు ఎక్సైజ్ శాఖను ఏమాత్రం పట్టించుకునే వారు కాదు . పైగా సారా బట్టీలపై దాడులకు వచ్చిన వారిపై ఎదురుదాడులకు దిగి , అధికారులు , సిబ్బందిని కూడా హత్య చేసిన సందర్భాలు ఉన్నాయి . స్థానికంగా బలంగా ఉండే వ్యాపారులను ఎదుర్కొనేందుకు ఆయుధాలు సమకూర్చాలన్న ప్రతిపాదనలు కూడా ఆచరణలోకి రాలేదు . ఇక ఇసుక అక్రమ రవాణా గురించి చెప్పనక్కర్లేదు . ఇసుక అక్రమ రవాణా ద్వారా టిడిపి ఎమ్మెల్యేలతో సహా నాయకులు కోట్ల రూపాయలు ఆర్జించారన్నది బహిరంగ రహస్యం . దీంతో సారా , ఇసుక అక్రమ రవాణా మూడుపువ్వులు , ఆరు కాయలుగా సాగింది . అదే స్థాయిలో సారాకు బానిసైన వారు కూడా ఇళ్లు , ఒళ్లు గుల్ల చేసుకున్నారు . వీరిలో చాలామంది సారా మహమ్మారికి బలయ్యారు .

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నాటు సారాను నిర్మూలించేందుకు పోలీసు , ఎక్సైజ్ శాఖలతో కలిపి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు . నాటు సారా , గుట్కాలు , గంజాయి , ఇసుక అక్రమ రవాణాను అరికట్టే ప్రధాన లక్ష్యంతోనే ఎస్ఇబిని ఏర్పాటు చేశారు . లక్ష్యసాధనలో ఎస్ఇబి కూడా దూకుడుగా వ్యహరిస్తోంది . ఎస్ఇబి పనితీరు సత్ఫలితాలను ఇస్తోంది .

గోదావరి పరివాహక ప్రాంతాలు సారా బట్టీలు , ఇసుక అక్రమ రవాణాకు అనుకూలంగా ఉండేవి . గతంలో గోదావరి లంకల్లో ఏర్పాటు చేసిన సారా బట్టీలపై దాడులకు వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిని గోదావరి నదిలో ముంచేసి , మృతదేహాలకు రాళ్లు కట్టి కిరాతకంగా హత్య చేశారంటే సారా వ్యాపారులు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు . అయితే నేటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది . పోలీసులతో కూడిన సెబ్ బృందాలను చూస్తేనే సారా , ఇసుక అక్రమ రవాణాదారులు హడలిపోతున్నారు .

తూర్పు లో సారాపై సమరం

తూర్పుగోదావరి జిల్లాలో సెబ్ ఏర్పడిన తరువాతి నుంచి ఇప్పటి వరకు 20 వేలకు పైగా ఉన్న సెబ్ , పోలీసు స్టేషన్ల పరిధిలో 2 లక్షలకు పైగా నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు . స్వాధీనం చేసుకున్న లక్షలాది లీటర్ల సారాను ఇటీవల ఏలూరు రేంజి డిఐజి కె మోహనరావు , సెబ్ డైరెక్టర్ ఎ రమేష్ , ఎస్సీ ఎం రవీంద్రనాధ్ పర్యవేక్షణలో ధ్వంసం చేశారు . మరోవైపు సారా తయారీ , విక్రయాల ద్వారా ఉపాధి పొందుతున్న కొన్ని వర్గాల వారిలో మార్పు తెచ్చి , వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించేందుకు పరివర్తన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కృషిచేస్తోంది . ఏది ఏమైనా సెబ్ పనితీరు సెహబాష్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp