సుప్రీంకోర్టులో నేడు కీలక తీర్పులు

By Kiran.G Nov. 14, 2019, 09:18 am IST
సుప్రీంకోర్టులో నేడు కీలక తీర్పులు

దేశంలో సంచలనం కలిగించిన 3 విషయాలపై సుప్రీం కోర్ట్ నేడు తీర్పు ఇవ్వనుంది. ఇందులో అన్ని వయసుల మహిళలకు శబరిమలలో ప్రవేశం కల్పించే అంశం కాగా మరొకటి రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు జరిగిన అవినీతి ఇంకొకటి రెబెల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు విషయంలో నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది

శబరిమల ఆలయంలో 10 నుంచి 50 సంవత్సరాల మధ్య గల మహిళలు ప్రవేశంపై ఉన్న అంశాలను ఎత్తి వేస్తూ సుప్రీం కోర్ట్ 2018 సెప్టెంబర్ 28న తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును పున సమీక్షించాలని కోరుతూ దాదాపు 65 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. కేరళ ప్రభుత్వం కూడా పిటిషన్ వేసింది. దీనిపై నేడు సుప్రీంకోర్టులో తుది తీర్పు రానుంది.

రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయని వేసిన పిటిషన్లను 2018 డిసెంబర్ 14న సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. అయితే ఈ తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా. అరుణ్ శౌరీలతోపాటు, ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నేడు తుది తీర్పు రానుంది.

రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ "చౌకిదార్ కి చోర్ హై" అంటూ వ్యాఖ్యలు చేసిన, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి, కోర్టు ధిక్కార నేరం కింద సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన తీర్పు నేడు వెలువడనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp