ఇప్పుడు కూడా హైద్రాబాద్‌ను తానే కట్టానంటారా..

By Jaswanth.T Oct. 23, 2020, 04:39 pm IST
ఇప్పుడు కూడా హైద్రాబాద్‌ను తానే కట్టానంటారా..
బావా.. చెంద్రబాబునాయుడు ఇప్పుడు కూడా ‘‘హైద్రాబాదును నేనే కట్టాను’’ అంటాడంటావా.. ‘అంటే నేనేదో ఇప్పుడు టైమొచ్చిందని అనడం కాదు బావోయ్‌.. నాకనిపించింది నిన్ను అడిగేసాను.. లేకపోతే మనం ఆగలేం కదా.. అంటూ సాగదీసాడు మణిగాడు.

అదేంట్రా అదిప్పుడెందుకు గుర్తుకొచ్చింది నీకు.. అంటూ ఉలిక్కిపడ్డాడు కిట్టయ్య.

అదేం లేదు బావా తాను గతంలో చేసిన ఘనకార్యాలు చెప్పుకునేటప్పుడు సహజంగా హైదరాబాదును నేనే తయారు చేసాను అన్న మాట ముందుండేది కదా.. అందుకే గుర్తుకొచ్చి ఇప్పుడడిగా. హైదరాబాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళగ్గానీ ఈ మాటలు చెప్పామనుకో.. అసలే మంట మీదున్నారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు కదా.. బావా అన్నాడు వేళాకోళంగా.

ఒరే నీ వెటకారానికేం తక్కువ లేదు. అసలే హైదరాబాదు వాళ్ళు ఆ మాట కొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు భారీ వర్షాలకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ ప్రత్యేకించి ‘‘హైదరాబాదు’’ అని నువ్వేమీ నొక్కి చెప్పక్కర్లేదురా అంటూ మణిగాడి మాటల్ని ఆపే ప్రయత్నం చేసాడు కిట్టయ్య.

అది కాదు బావా మొన్నా మధ్య ఏదో ఓటు, నోటు కేసు దగ్గర్నుంచి హైదరాబాదును గురించి పలవరింతలు తగ్గాయి గానీ లేకపోతే చంద్రబాబు నాయుడు పేపర్లతో మాట్లాడినా.. టీవీలో కన్పించినా గానీ ముందు హైదరాబాదు గురించే చెప్పుకొచ్చేవారు కదాని అన్నాన్లే బావా అన్నాడు మణి కాస్త చిన్నబుచ్చుకుంటూ..
ఓరినీ ఆసాధ్యం కూలా.. మనలో మన మాట అంతగా హైదరాబాదునే నిర్మించేయగలిగితే.. సుమారు అయిదేళ్ళ క్రితం మొదలెట్టిన అమరావతి ఎంతసేపు కట్టేద్దుర్రా.. అదంతా పబ్లిసిటీ స్టంట్‌ అంటార్రా..

మనం చేసినా.. చెయ్యకపోయినా మేలు జరిగిన ప్రతి దాన్ని మన అక్కౌంట్లో వేసేసుకోవడం కొంత మంది రాజకీయ నాయకులకు మాత్రమే అబ్బే విద్యరా, అందులోనూ చంద్రబాబునాయుడికి ఇది అంతకంటే ముందే అబ్బేసిందటార్రా బాబూ.. అంటూ కాస్త నెమ్మదిగా మణిగాడి చెవిలో చెప్పినట్టు చెప్పాడు కిట్టయ్య.

ఏంటి బావా అంతసీక్రెట్‌గా చెబుతున్నావు.. అందరూ అనుకునేదేగా.. మరీ అంత రహస్యం ఎందుకో.. అన్నాడు మణి కాస్తంత గొంతుపెంచి.

అప్పట్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి రోజులొచ్చాయి. దాంతో హైటెక్‌సిటీ పేరుచెప్పి అప్పుడు కూడా ఆ చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌లాంటిదే జరిగిందంటూ ఉంటారు.. అంతే తప్ప అప్పుడెప్పుడో వందల ఏళ్ళ క్రితమే నవాబుల ఏలుబడిలో అభివృద్ది చెందిన పట్టణాన్ని ఈయన చేసేదేంట్రా అంటూ ముగింపునిచ్చి అక్కడ్నుంచి జారుకున్నాడు కిట్టయ్య.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp