ఇసుక పరిస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే

By Kotireddy Palukuri Dec. 13, 2019, 11:31 am IST
ఇసుక పరిస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే

నిన్న మొన్నటి వరకు ఆంద్రప్రదేశ్ లో రాజకీయ అంతా ఇసుక చుట్టూ నడిచింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనటువంటి వర్షాలతో.. రాయలసీమ లోని పెన్నా నది నుంచి కృష్ణ, గోదావరి, ఉత్తరాంధ్ర లోని వంశధార నది వరకు అన్ని చిన్నా పెద్ద నదులు వరదతో వెల్లువెత్తాయి. ఫలితంగా ఇసుక సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తలెత్తిన ఇసుక కొరత ప్రభుత్వ వైఫల్యం అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ధర్నాలు, దీక్షలు, లాంగ్ మార్చ్ లతో హోరెత్తించాయి. వరదలు తగ్గుముఖం పడితే సమస్య పూర్తిగా పోతుందని ప్రభుత్వం పేర్కొన్నా.. ప్రతిపక్షాలు తమ పంథాను విడవలేదు.

కేవలం 15 రోజుల్లో సిన్ రివర్స్ ఇనది. ప్రభుత్వమే నేరుగా ఇసుక విక్రయాలు చేపడుతోంది. కొరత ఏమాత్రం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక కొరత సమస్య ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు. పైగా గుట్టలు గుట్టలుగా నిల్వలు పేరుకుపుతున్నాయి. గోదావరి లో ముఖ్యంగా రాజమహేంద్రవరం సమీపంలోని సీతానగరం మండలంలోని ర్యాంపులలో నాణ్యమైన ఇసుక లభిస్తుంది. ఇక్కడ నుంచి పెద్ద లారీల్లో ఇసుక ప్రతి రోజు విశాఖ పట్టణానికి తరలిస్తారు.

ఐతే ప్రస్తుతం డిమాండ్ లేకపోవడంతో సీతానగరం ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. ఇసుక డంపు చేసి నిల్వ కేంద్రాలకు తరలించే పనిని ఏపీ ఎండిసి అధికారులు కాంట్రాక్టర్ల కు అప్పగించారు. వారు.. సీతానగరం నుంచి ఇసుకను విశాఖ లోని నిల్వ కేంద్రాలకు తరలించారు. విశాఖ కు అటు శ్రీకాకుళం నుంచి ఇసుక వస్తోంది. ఫలితంగా ఇసుక సరఫరాకు తగినట్లు డిమాండ్ లేకపోవడంతో నిల్వ కేంద్రాల్లో ఇసుక గుట్టలుగా పేరుకుపోయింది.

ఇసుక విక్రయాలు తగ్గడంతో ఎపి ఎండిసి కి కొత్త సమస్యలు వచ్చాయి. రవాణా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లింపులు నిలిచిపోయాయి. కేవలం సీతానగరం మండలం నుంచి ఇసుక తరలించిన లారీ కాంట్రాక్టర్లు 5.85 కోట్ల రూపాయలు బకాయలు పేరుకుపోయాయి. కేవలం 15 రోజుల్లో ఇసుక ముఖ చిత్రం మారింది. మొన్నటి వరకు ఇసుక కొరతపై ఆందోళనలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఇసుక అనే అంశమే లేనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp