కులం,మతం కావడి కుండలను ఎత్తిన సాధినేని యామినీ శర్మ

By Suresh 17-11-2019 08:58 AM
కులం,మతం  కావడి కుండలను ఎత్తిన సాధినేని యామినీ శర్మ
నక్క పుట్టి  నాలుగు ఆదివారాలు కాలేదంట,ఇంత గాలీవాన నా జీవితంలో ఎరగను అన్నదట . కులతత్వ ముద్ర పడ్డ టీడీపీ పార్టీలోకొచ్చి నాలుగు రాళ్లు వెనక వేసుకోటం మొదలెట్టి నాలుగేళ్లు కాలేదు , అప్పుడే పార్టీలో కులతత్వం గురించి మాట్లాడటం , టికెట్ కోసం కుల రాజకీయాలు చేయటము , పార్టీలు మార్చడమూ చూస్తే నక్కలు చిన్నబోతాయేమో .
మొదట సాధినేని యామినిగా సంఘ సేవికగా పార్టీ రంగ ప్రవేశం చేసిన వ్యక్తి తదుపరి పార్టీ మహిళా నేతగా ఎదగడం ప్రాంతీయ జాతీయ పార్టీలని దుమ్మెత్తిపోయడం అనంతరం ఎన్నికల నాటికి యామినీ శర్మగా పూర్వ కులానికి రూపాంతరం చెందటం , టీడీపీలో కుల రాజకీయాల గురించి మాట్లాడటం , ఎమ్మెల్యే టికెట్ కోసం కుల రాజకీయానికి తెర లేపడం చివరికి పార్టీ అధినేత బాబుగారిలాగే కాల్ రికార్డ్ తో అడ్డంగా దొరికిపోవటం లాంటి ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరికైనా విడ్డూరం అనిపించక మానదు . 

ఏదో సిన్మాలో మహేష్ బాబు డైలాగ్ కొట్టినట్టు this is yamini sadhineni chowdary sarma track record just in the span of five years అనాలేమో . ప్రస్తుతం వారు జాతీయ సేవలో నిమగ్నమవుదామని కమలంలో ఓ దళం కాబోతున్నారుట .

ఎవరీ సాధినేని యామినీ . ఎంబీఏ స్టూడెంట్ , తుఫాన్లు లాంటి విపత్తులు సంభవించినప్పుడు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే రేడియో వ్యాఖ్యాత . 2014 లో శ్రీయం అనే సంస్థని స్థాపించిన యామినీ టీడీపీ అధికారంలోకి రాగానే ఒక్క సారిగా తన వ్యాపారాన్ని విస్తరించింది . ముగ్గురు ఉద్యోగస్తులతో ప్రారంభించిన
సీసీ కెమెరాలు , సెక్యూరిటీ అలెర్ట్ సిస్టమ్స్ సప్లై చేసే కంపెనీ కేవలం ఎనిమిది నెలల్లో ఆరు కోట్ల టర్నోవర్ సాధించిందంటే టీడీపీ నుండి యామినీకి అందిన సహకారాన్ని ఊహించొచ్చు . 

హుదూద్ తుఫాన్ సమయంలో శాటిలైట్ రేడియో వినియోగించే క్రమంలో బాబు గారికి చేరువైన యామినీ ఆ తర్వాత తన వ్యాపారాన్ని బాబు గారి సహకారంతో అంచెలంచెలుగా విస్తరించింది . బాబు గారి రియల్ టైం గవర్నెన్స్ లో యామినీ కంపెనీ పాత్ర సుస్పష్టం . ఆకట్టుకునే రూపం , మంచి వాగ్దాటి , ఎంతటి మాటలు మాట్లాడటానికైనా వెరవని గుణం ఉన్న మహిళల్ని గుర్తించి ప్రోత్సహించడంలో బాబు గారి తెలివితేటల్ని ఎవరూ కాదనలేరు . 

2014 లో చిన్న గదిలో పెట్టిన కంపెనీ ద్వారా ఆరు కోట్ల టర్నోవర్ సాధించిన యామినీ 2019 నాటికి అధికారికంగా తొంభై కోట్ల ఆస్తులు కలిగి ఉందంటే టీడీపీ ద్వారా ఎన్ని మేళ్ళు పొందిందో ఊహించవచ్చు . ఈ మేళ్ల వెనక లోకేష్ ఉన్నాడని అంతర్గత ప్రయోజనాలు ఉన్నాయని టీడీపీలోనే గుసగుసలు వినిపించేవి . మరి పొందిన మేళ్లకి తగ్గట్టు పార్టీకి ఉపయోగపడిందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడింది . 

టీడీపీ ప్రత్యర్థి ఏ పార్టీ వారైనా అవతలి వ్యక్తి ఎంతటి వారైనా నిజానిజాలతో సంభందం లేకుండా ఘాటు వ్యాఖ్యలతో , తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడేది . తన అందం , తెగింపు వ్యాఖ్యలకు జనం కూడా తన వైపు దృష్టి సారించేవారు . 2016 తర్వాత సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన యామినీ నిజానిజాలతో సంభందం లేకుండా సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది . 

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న పార్టీ వైసీపీ అని , బీజేపీతో కుమ్మక్కు అయ్యారని , జగన్ మోడీ రెడ్డి అని యామినీ ట్రోల్ చేసిన విషయాలే తర్వాతి గంటల్లో లోకేష్ ట్విట్టర్ , FB అకౌంట్స్ లో ప్రత్యక్షమయ్యేవంటే తన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో యామినీ దూకుడు చూసి పలువురు ఆశ్చర్యపోయారు . సహజంగా పవన్ కల్యాణ్ ని 
ఒక మాట అనటానికి కూడా కొమ్ములు తిరిగిన మగ రాజకీయ నాయకులు సైతం వెనకా ముందూ ఆడేవారు అతని ఫాన్స్ సోషల్ మీడియాలో చేసే దాడులకు , తీవ్ర వ్యాఖ్యలకు భయపడి అలాంటిది టీడీపీతో విభేదించాక పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది యామినీ .  

పవన్ కళ్యాణ్ పావలాకి పనికిరాని వాడని లోకేష్ రెండు వేల రూపాయల నోటు వంటి వాడని వ్యాఖ్యానించి జనసేన శ్రేణుల్లో అలజడి రేపింది . మరో సందర్భంలో పవన్ కళ్యాణ్ మల్లె పూలు పిసుకుకొంటానికి తప్ప ఎందుకూ పనికిరాడంటూ పవన్ వ్యక్తిగత జీవితం పై చేసిన ఎగతాళి వ్యాఖ్యలు పవన్ కానీ జనసేన శ్రేణులు కానీ జీవిత కాలం మర్చిపోలేరేమో .ఇందుకు ప్రతిగా యామినీ కూడా వేధింపులు అనుభవించింది . సోషల్ మీడియాలో టీడీపీ నాయకులతో సంబంధాలు అంటగడుతూ ఫేక్ అకౌంట్స్ నుండి పోస్ట్లు , తన అకౌంట్స్ లో జన సైనికుల వేధింపులు , చివరికి వ్యక్తిగత ఫోన్ నెంబర్ కి సైతం కాల్స్ చేసి వేధించటం లాంటి వన్నీ ఎదుర్కొంది యామినీ . 
అధికార టీడీపి అండతో పలువురి మీదకేసులు పెట్టి అరెస్ట్ కూడా చేయించింది . 2018 చివర్లో తనని ట్రోల్ చేసిన కొందరు జనసైనికుల్ని అరెస్ట్ చేయించిన యామినీ గుంటూర్ లోని ఓ స్టేషన్ లో స్వయంగా  లాఠీ తీసుకొని కొట్టి ఆ కుర్రాల్ని తీవ్రంగా గాయపరిచింది అని అప్పట్లో సోషల్ మీడియాలో అల్లరి చెలరేగింది . ఆ తర్వాత జన సైనికులు యామినీ జోలి పోవటం మానేశారు . 

ఎన్నికలు సమీపించే కొద్దీ వైసీపీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా మొత్తాన్ని తన వైపు తిప్పుకొంది యామినీ . వైసీపీకి , బీజేపీకి , trs కి పొత్తులు అంటగడుతూ తెలుగు తల్లికి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని తాను చేసిన వ్యాఖ్యలు కొత్తవారు చూస్తే నిజమని నమ్మే విధంగా ఉండేవి .ఎన్నికలు సమీపించిన వేల టీడీపీ mla టికెట్ ఆశిస్తూ మరో కొత్త నాటకానికి తెరతీసింది యామినీ . అప్పటి వరకూ సాధినేని యామినీగా కమ్మ సామాజిక వర్గ వ్యక్తి భార్యగా చెలామణి అయిన యామినీ హఠాత్తుగా తన జన్మ కులం బ్రాహ్మణ పేరుతో యామినీ శర్మ అని అకౌంట్స్ ఓపెన్ చేసి చెలామణీ కాసాగింది .అంతేకాకుండా భ్రాహ్మణ సామాజిక వర్గం వారికి ఫోన్లు చేసి తమ సామాజిక వర్గానికి MLA టికెట్ కావాలని చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయమని తర్వాత తాను రంగ ప్రవేశం చేసి నేను అదే సామాజిక వర్గం కాబట్టి తనకు టికెట్ కేటాయించాలని కోరి టికెట్ సాధించుకొంటానని చెప్పి రెచ్చగొడుతూ కాల్ రికార్డ్స్ ద్వారా అడ్డంగా దొరికిపోయి టికెట్ రాకపోగా అభాసుపాలయ్యింది . 

టీడీపీ ఓటమి తర్వాత స్తబ్దుగా ఉన్న యామినీ తగ్గిన వ్యాపార అవకాశాల కోసమో మరెందుకో ఇప్పుడు బీజేపీ వైపు చూపు సారించింది . ఈ సందర్బంగా నిన్న టీవీ9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గత సంఘటనల పై టీవీ యాంకర్ అడిగిన ఏ ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పలేక అనుసరించిన దాటవేత వైఖరి చూస్తే నవ్వు రాక మానదు . 
మరీ ముఖ్యంగా మీరు టీడీపీలో రాణించటానికి కారణం అందమా , చొరవా , వాగ్దాటా అన్న ప్రశ్నకు , జయప్రదలాగా మిమ్మల్ని కూడా టీడీపీ వాడుకొని వదిలేసిందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలి పొంతన లేని సమాధానాలు చెప్పిన వైనం చూస్తే ఓడలు బళ్లు , బళ్ళు ఓడలు అనే సామెత గుర్తు రాక మానదు . 

మళ్లీ బాబే సీఎం , బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పే దమ్ముందా అని మోడీనే టాగ్ చేసి ప్రశ్నించిన , నా తెలుగు బిడ్డలకు అన్యాయం చేసిన బీజేపీ అని తెలుగు తల్లి వేషం కట్టి నటించిన , మోడీ , షాలు కలిసి ఆంధ్రాని వంచించారు అని కన్నాకి టాగ్ చేసి తిట్టిన యామినీని బీజేపీ వాళ్ళు ఎలా పార్టీలో చేర్చుకొంటారో , ఎలా ఆదరిస్తారో , తన ప్రజా సేవ తత్వాన్ని ఎలా వినియోగించుకొంటారో చూడాలి . 

ఏదేమైనా మల్లెలు పిసుక్కోమని పవన్ కి సవాల్ విసిరిన వ్యక్తి , చేతులు పిసుక్కొంటూ బీజేపీ వాకిట్లో నుంచోవటం ఆసక్తికరం , పవన్ కూడా బీజేపీతో పొత్తు కోసం ఆలోచిస్తున్నాడు అని రుమార్లు సాగుతున్న వేల బీజేపీ ఎటు మొగ్గు చూపుతుందో మరింత ఆసక్తికరం . టీడీపీకి మాత్రం కంట్లో కారం .
idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News