చంద్రబాబును పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో..?

By Kotireddy Palukuri Feb. 14, 2020, 07:23 am IST
చంద్రబాబును పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో..?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో రూ.2వేల కోట్లు కోట్లు బయటపడ్డ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డొల్ల కంపెనీలు పెట్టి శుబకాంట్రాక్టుల ద్వారా చంద్రబాబు కమీషన్లు తిసుకున్నారనేది ప్రధాన ఆరోపణ.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పీఎస్‌పై జరిగిన ఐటీ దాడులపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘పర్సనల్‌ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు బయటపడ్డాయి. మరి చంద్రబాబును పట్టుకుంటే... ఎన్ని వేల కోట్లో! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి?’ అంటూ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

కాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించిన వివరాలను అధికారులు బహిర్గతం చేశారు. ఆ వివరణలు ప్రెస్ నోట్ రూపంలో మీడియా కు విడుదల చేశారు. అందులో ప్రముఖ వ్యక్తి సన్నిహితులు, మాజీ పీఎస్ అంటూ పేర్కొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp