హెల్మెట్ ధరించకుంటే లైసెన్స్ సస్పెండ్

By Kiran.G Oct. 20, 2020, 12:04 pm IST
హెల్మెట్ ధరించకుంటే లైసెన్స్ సస్పెండ్

హెల్మెట్ తప్ప అన్ని ఉన్నాయని మురిసిపోతున్నారా..? హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి చిన్న ఫైన్ కట్టి బయటపడిపోదాం అనుకుంటున్నారా. ఇకపై ఆ పప్పులు ఉడకవు.. ఇకపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. కానీ ఈ రూల్ పెటింది తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తే హెల్మెట్ నిబంధన తప్పనిసరి చేసింది.

రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో ఇకపై ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే వారి లైసెన్సును మూడు నెలల పాటు రద్దు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం ప్రకటించిన ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.

గతంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. దాంతో మోటారు వాహన చట్టాల ప్రకారం హెల్మెట్ నిబంధనను కర్ణాటక రవాణామంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాలు వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ హెల్మెట్ లేకుంటే మాత్రం లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేయనున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp