తొమ్మిది నిముషాలు లైట్లు ఆపితే ఏమైందో తెలుసా ?

By iDream Post Apr. 06, 2020, 09:16 am IST
తొమ్మిది నిముషాలు లైట్లు ఆపితే ఏమైందో తెలుసా ?

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రదానమంత్రి నరేంద్రమోడి పిలుపులో భాగంగా యావత్ దేశం ఆదివారం రాత్రి తొమ్మిది నిమిషాల పాటు లైట్లను ఆపేసిన విషయం అందిరికీ తెలిసిందే. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది నిమిషాల పాటు లైట్లను ఆపేసి దీపాలను వెలిగించాలని ప్రధాని పిలుపిచ్చారు. మోడి పిలుపుకు యావత్ దేశ ప్రజలు సానుకూలంగా స్పందించి లైట్లు ఆపేశారు.

తొమ్మిది నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లైట్లను ఆపేయటం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. మామూలుగా ప్రధానమంత్రి చెప్పిన తొమ్మిది నిముషాల వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద 6 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. అంటే అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం సాధారణంగా ఉండే వినియోగంతో పోల్చినపుడు ఆదివారం తొమ్మిది నిమిషాల పాటు లైట్లు ఆపేయటం వల్ల 30 శాతం వినియోగం తగ్గిపోయిందని రికార్డయ్యింది.

ఇదే విషయమై ట్రాన్స్ కో జాయింట్ ఎండి చక్రధర్ మాట్లాడుతూ ఒకేసారి వినియోగం పడిపోవటంతో లో ఓల్టేజీ సమస్య వచ్చిందన్నారు. అయితే పరిస్దితి చేయిదాటిపోకుండా లో ఓల్టేజీ సమస్య పెరగకుండా తగ్గిన వినియోగాన్ని వ్యవసాయరంగానికి మళ్ళించినట్లు చెప్పారు. విద్యుత్ వినియోగంలో మ్యానేజ్మెంట్ వల్ల ఎక్కడ కూడా గ్రిడ్ లో లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా చక్రధర్ వివరించారు. తొమ్మిది నిమిషాల్లో తమ అంచనాకన్నా వినియోగం తగ్గిపోయిందని అంగీకరించారు.

ఆ తొమ్మిది నిమిషాలు విద్యుత్ వినియోగం నిలిపేయటం వల్ల మన రాష్ట్రంలోనే 1600 మెగావాట్ల విద్యుత్ తగ్గిపోతే మరి పొరుగునే ఉన్న తెలంగాణా తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా విద్యుత్ వినియోగం ఎంత తగ్గుంటుందో అంచనా వేసుకోవచ్చు. ఏపికన్నా పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మరింత ఎక్కువ వినియోగం తగ్గే ఉంటుందనటంలో సందేహం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp