ఇందుకేనా చంద్రబాబు ఇంగ్లీషు మీడియంను అడ్డుకున్నది ?

By Phani Kumar Apr. 20, 2020, 01:54 pm IST
ఇందుకేనా చంద్రబాబు ఇంగ్లీషు మీడియంను అడ్డుకున్నది ?

పై ఫొటో చూస్తే స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని చంద్రబాబునాయుడు ఎందుకు అడ్డుకున్నాడనే విషయం తెలిసిపోతుంది. పిల్లలకు నాలుగు అక్షరం ముక్కలు అదికూడా ఇంగ్లీషులో నేర్పిస్తే వాళ్ళు జీవితాలైనా బాగుపడతాయన్న ఏకైక ఉద్దేశ్యంతోనే మధ్య, దిగువ మధ్య తరగతి జనాలు కూడా తమ పిల్లలను ఇంగ్లీషుమీడియం స్కూళ్ళల్లోనే చేర్పిస్తున్నారు. ఇక్కడ ఇంగ్లీషుమీడియం స్కూళ్ళంలే ప్రైవేటు స్కూళ్ళు తప్పే మరో మార్గంలేదు. అందులోను ఇంగ్లీషుమీడియం స్కూళ్ళల్లో కూడా మళ్ళీ కార్పొరేట్ స్కూళ్ళనే వేరేగా ఉన్నాయి.

ఇంగ్లీషుమీడియం అయినా కార్పొరేట్ స్కూళ్ళయినా ఫీజుల మోత మోగిపోవాల్సిందే. అందులోను వీటిల్లో ఎక్కువ భాగం తెలుగుదేశంపార్టీలోని కీలక నేతలకు సంబంధించినవే కావటం గమనార్హం. నారాయణ, శ్రీ చైతన్య బ్రాండ్ ఎవరిది అంటే ఎవరినడిగినా చెప్పేస్తారు. అలాగే మరికొన్ని ప్రముఖ స్కూళ్ళు కూడా టిడిపి నేతలవో లేకపోతే మద్దతుదారులవో అన్న విషయం తెలిసిందే.
పై స్కూళ్ళల్లో తమ పిల్లలను చదివించటానికి తల్లి, దండ్రులు ఫీజులు కట్టే విషయంలో అప్పుల పాలవుతున్నారు. పాదయాత్ర సమయంలో ఇటువంటి అనేక సమస్యలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చాయి. దాంతో అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్కూళ్ళల్లోనే ఇంగ్లీషుమీడియం ప్రవేశపెడితే పిల్లల చదువులకు తల్లి, దండ్రులు అప్పులు చేయాల్సిన అగత్యం ఉండదని జగన్ ఆలోచించాడు. అందుకనే స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెట్టాడు.

అయితే జగన్ ఏమో సమాజంలోని మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేదల పిల్లల భవిష్యత్తును ఆలోచిస్తే చంద్రబాబునాయుడు మాత్రం తన మద్దతుదారులైన నారాయణ, శ్రీ చైతన్య లాంటి మ్యానేజ్మెంట్ల భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచించినట్లు కనబడుతోంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెడితే లక్షలాది మంది విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుంది. అదే సమయంలో చంద్రబాబు మద్దతుదారులకు వందల కోట్ల రూపాయలు నష్టాలు వస్తాయి.

ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళ నుండి విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ళకు మారిపోతే ప్రైవేటు మ్యానెజ్మెంట్లకు తగిలే దబ్బతో చివరకు స్కూళ్ళనే మూసేయాల్సొస్తుంది. అదే జరిగితే పార్టీ ఆదాయమూలాలు నేలమట్టమైపోతాయనే టెన్షన్ చంద్రబాబులో మొదలైనట్లుంది. అందుకనే బిజెపి నేతగా చెలామణి అవుతున్న సుధీష్ రాంబొట్లతో కోర్టులో కేసు వేయించి మొత్తం కథ నడిపించాడు చంద్రబాబు. ఏదేమైనా జగన్ ఆలోచనను చంద్రబాబు ఎందుకు అడ్డుకున్నాడో ఇపుడు అందరికీ అర్ధమైపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp