ఎస్పీబీకి చరమగీతం పాడింది సామజవరగమనేనా?!

By Voleti Divakar Sep. 27, 2020, 12:50 pm IST
ఎస్పీబీకి చరమగీతం పాడింది సామజవరగమనేనా?!

అన్ లాక్ తొలినాళ్లలో గానగంధర్వుడు ఎపి బాలసుబ్రహ్మణ్యంకు హైదరాబాద్లోని ప్రముఖ ఫిలిం సిటీ నుంచి సమాచారం వచ్చింది. ఆయన ఆధ్వర్యంలో టీవీ చానల్ కోసం చేస్తున్న సామజవరగమన సంగీత ధారావాహికలో పాల్గొనేందుకు రావాల్సిందిగా ఆ సమాచార సారాంశం. దేశవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తున్న సమయంలోనే దాదాపు అన్లాక్ లో భాగంగా ఆంక్షల సడలింపు ప్రారంభమైంది. చెన్నైలోని ఇంటికే పరిమితమైన ఎస్పీబీ ఈ సమయంలో తాను రాలేనని నిస్సహాయతను వ్యక్తం చేశారు. తీవ్రమైన ఒత్తీళ్లు రావడంతో బాలు హైదరాబాద్ కు బయలుదేరక తప్పలేదు. తన భార్య సావిత్రి, కుమారుడు చరణ్, వ్యక్తి గత కార్యదర్శిని వెంటబెట్టుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు.

అదే ఆయన ప్రాణాలకు మీదకు తెచ్చిందని సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం తీవ్ర చర్చ కు దారితీస్తోంది. అప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఆ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 23 మంది కరోనా బారిన పడినట్లు సమాచారం. ఇందులో ప్రముఖ గాయకులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిరోజులకే ఎస్పీబీ, ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత ఆయన కోలుకోలేక ప్రాణాలు కోల్పోయారు.

కరోనా బారినపడిన ఎస్సీబీ చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. మధ్యలో ఆయన పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు కనిపించినా ఆయనకున్న ఇతర అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆయన సతీమణి సావిత్రీ మాత్రం కరోనా నుంచి బయటపడగలిగారు.

అప్పటి వరకు చెన్నైలోని ఇంటి వద్ద కరోనాపై చైతన్య గీతాలు ఆలపిస్తూ కాలక్షేపం చేస్తున్న74ఏళ్ల బాల సుబ్రహ్మణ్యంను షూటింగ్ కు పిలవడమే ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందని ఒక వైద్యుడు విశ్లేషించారు. పాటలు పాడటం, గట్టిగా మాట్లాడం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. సామజ వరగమనా కార్యక్రమం షూటింగ్ సందర్భంగా బాలు మాస్కు ధరించలేదని, భౌతిక దూరం పాటించలేదని, తరుచూ ముక్కును తాకుతూ కనిపించారని ఆ వైద్యుడు విశ్లేషించారు.

ఈ సమయంలోనే ఎస్పీబీకి కరోనా సోకినట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా తాను ఎంతగానో అభిమానించి, ఎంతో మంది ఔత్సాహికులను ప్రోత్సహించిన కార్యక్రమమే బాలు సంగీత జీవితానికి చరమగీతం పాడటం విషాదం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp