రాజకీయ ప్రవేశంపై రజనీ అభిప్రాయం ఏమిటి?

By Kiran.G Oct. 29, 2020, 04:22 pm IST
రాజకీయ ప్రవేశంపై రజనీ అభిప్రాయం ఏమిటి?

రజనీ ఆరోగ్య స్థితిపై వైరల్ అవుతున్న లేఖ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ లేఖ ఇప్పుడు రజనీకాంత్ అభిమానుల్లో ఎన్నో సందేహాలకు కారణం అవుతుంది. రజనీ రాజకీయాల్లోకి వస్తారా లేక తప్పుకుంటారా అన్న మీమాంసలో ఆయన అభిమానులు ఉన్నారు.

రజని పేరుతో వైరల్ అవుతున్న లేఖలో ఏముంది?

రజనీ పేరిట వచ్చిన లేఖలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించిన సమాచారం ఉంది. తనకు కిడ్నీ సమస్య ఉందని లేఖలో ఉంది.2011లో రజనీకాంత్ కిడ్నీ వ్యాధి బారినపడడంతో సింగపూర్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నారని, 2016లో కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఈసారి అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నారని వైరల్ అవుతున్న లేఖలో ప్రస్తావించారు.నా ప్రాణం గురించి నాకు భయం లేదు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ల క్షేమం గురించి ఆలోచిస్తున్నా. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ఈ రంగంలోకి రావాలనుకున్నా. మధ్యలో నా ఆరోగ్యం క్షీణిస్తే అది కొత్త సవాళ్లకు దారితీస్తుంది.ప్రస్తుత పరిస్థితుల్లో నేను అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పారు. వ్యాక్సిన్‌ వచ్చినా కూడా బయటకు వెళ్లడం ప్రమాదకరమని సూచించారు. అయినప్పటికీ ముందుకెళ్లాలంటే జనవరి 15లోగా రాజకీయ పార్టీ ప్రారంభించాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది అభిమానులు, ప్రజలకే వదిలేస్తున్నా అని రజని లేఖలో వెల్లడించినట్లు సోషల్ మీడియాలో లేఖ వైరల్ అవుతుంది.

రజనీకాంత్ స్పందన ఏంటి?

ప్రస్తుతం సోషల్ మీడియాలో రజనీకాంత్ రాసినట్లు వైరల్ అవుతున్న లేఖ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు.ఆ లేఖ తనది కాదని, కానీ అందులో తన ఆరోగ్యం గురించి ఉన్న సమాచారం నిజమేనని స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యులను కలిసి వారి సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మక్కల్ మండ్రం (RMM) సభ్యులతో చర్చించిన తర్వాత ఓ అధికారిక ప్రకటన ఉంటుందని రజనీ తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp