రాజకీయ అవినీతికి జగన్ మూకుతాడు

By Kotireddy Palukuri 14-11-2019 02:49 PM
రాజకీయ అవినీతికి జగన్ మూకుతాడు

తాను పాటించి.. ఇతరులు పాటించాలని చెప్పినప్పుడు అనుకున్న లక్ష్యం చేరుకుంటాము. అలా చేసిన వాడే నాయకుడవుతాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే కొనసాగుతోంది. అవినీతి నిర్ములనకు జగన్ సర్కార్ కంకణం కట్టుకుంది. ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో జరిగిన బహిరంగ సభల్లో తనకు ఒక్క సారి అవకాశం ఇస్తే అవినీతి కనపడకుండా చేస్తానని సీఎం జగన్ మోహన్ రెడ్డ్ ప్రజల సాక్షిగా మాట ఇచ్చారు. ఆ మాటను విశ్వసించిన ప్రజలు జగన్ కు పట్టం కట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ జగన్ తన అడుగులు అవినీతి నిర్ములన వైపుగా వేస్తున్నారు.

ముందు తన ప్రభుత్వం పాటించి, ఆ తర్వాత అధికారుల వద్దకు వెళ్లేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేయడం ద్వారా తాను అనుకున్న లక్ష్యం చేరుకోవాలని జగన్ భవిస్తున్నట్లుగా అయన తీసుకుంటున్ననిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ అవినీతిని అంతం చేసేలా ఇప్పటికే సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా నిన్న బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ప్రజా ప్రతినిధుల, రాజకీయ నేతల ప్రమేయాన్ని పూర్తిగా తీసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేసే అధికారాన్ని ఉన్నతాధికారులకు కట్టబెట్టారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతులు, ఐఏఎస్‌ హోదా గల కార్యదర్శులకు అప్పగించారు. దళారులు, రాజకీయ నేతల ప్రమేయం లేకుండా పారదర్శకంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలనీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

గత నెలలో విద్యుత్ పంపిణి సంస్థల్లో జరిగిన జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీని కూడా అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. గ్రామ సచివాలయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7500 జూనియర్ లైన్ మెన్ పోస్టులు మెరిట్ ఆధారంగా భర్తీ చేసారు. రాత పరీక్ష లేకపోవడంతో దళారులు రంగంలోకి దిగారు. రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ పోస్టులు తమ వారికి ఇప్పించుకోవాలని చూసారు. ఒక్కొక్క పోస్టుకు 7 లక్షల నుంచి డిమాండ్ ను బట్టి 10 లక్షల వరకు ధర పెట్టారు. ఆ మేరకు అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారు. అన్ని ప్రయత్నాలు చేసారు. కానీ చివరకు మెరిట్ ప్రకారం భర్తీ జరగడంతో ప్రజా ప్రతినిధులు, దళారులు కంగుతిన్నారు.

జూనియర్ లైన్ మెన్ పోస్టులు భర్తీ లో సబ్ స్టేషన్ల లో పని చేసే స్విఫ్ట్ ఆపరేటర్లు 2 వేల మంది ఎంపికయ్యారు. తాత్కాలిక పద్దతిలో పని చేసే ఈ పోస్టులను గతంలో డబ్బులు తీసుకుని భర్తీ చేసేవారు. ఒక్కో పోస్ట్ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ధర పలికింది. స్థానికి ప్రజా ప్రతినిదులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సిఫార్సు మేరకు ఈ స్విఫ్ట్ ఆపరేటర్ల నియామకాలు జరిగాయి. ఈ సారి కూడా అలాగే భర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆశావహులతో బేరాలు కుదిరాయి. డబ్బు తీసుకుని ఈ పోస్టులను భర్తీ  చేస్తున్నారన్న విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో నియామక ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసారు. అవుట్ సోర్సీసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేసారు.

ఉద్యోగాల భర్తీ, బదిలీ లలో రాజకీయ జోక్యంతో అవినీతి చోటు చేసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్, సిఐ పోస్టులతో పాటు అన్ని విభాగాల్లో బదిలీలు ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా జరిగాయి. ఎమ్మెల్యే లేఖలు ఇచ్చిన వారే ఆయా పోస్టులో బదిలీపై వచ్చారు. లేఖలు తెచ్చిన వారిని ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆయా పోస్టుల్లో నియమించేవారు. లేఖలు ఇచ్చిన ప్రజా ప్రతినిధి పోస్టును బట్టి లక్షల రూపాయలు తీసుకునేవారు. ఒక స్థానంలో రెండేళ్ల కాలపరిమితి ఉన్న సిఐ పోస్టుకు స్టేషన్ ను బట్టి, అక్కడ వచ్చే ఆదాయాన్ని బట్టి 5 లక్షల నుంచి గరిష్టంగా 15 లక్షల ధర పలికింది. రెండేళ్లలో ఆ సిఐ ఎమ్మెల్యేకి ఇచ్చిన మొత్తం, వడ్డీ సంపాదించుకుంటారు. రాజకీయ అవినీతే అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతికి ప్రధాన కారణంగా ఉంది. అందుకే ముందుగా రాజకీయ అవినీతిని అరికట్టడంలో సీఎం జగన్ నిమగ్నమయ్యారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News