రైల్వే లో నివర్ హెల్ప్ లైన్ నెంబర్లు

By Voleti Divakar Nov. 26, 2020, 11:14 am IST
రైల్వే లో నివర్  హెల్ప్ లైన్ నెంబర్లు

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రా దక్షిణ కోస్తా తీరం చేరువకు రాబోతున్న ‘‘నివర్‌’’ తుపాను కారణంగా రానున్న రెండు రోజుల్లో ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు, కొన్ని రైళ్ళను దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

ఈ సమయంలో చెన్నై, తిరుపతి, రేణిగుంట మరియు పాకాల మీదుగా నడిచే ప్రత్యేక రైళ్ళను పరిస్థితులకు అనుగుణంగా పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలను ప్రణాళికాబద్ధం చేసుకోవాలని సూచించారు. ‘‘నివర్‌’’ తుపాను నేపథ్యంలో రైళ్ల సమాచారాన్ని తెలియజేసేందుకు దక్షిణ మధ్యరైల్వే పరిధిలో అన్ని ప్రధాన స్టేషన్లలో హెల్ప్‌లైన్‌ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు.

సికింద్రాబాదు : 040`27833099,
విజయవాడ : 0866 ` 2767239,
గుంతకల్లు : 7815915608,
గుంటూరు : 0863 ` 2266138,

నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రాజెక్టుల ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాధ్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యతో చర్చించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp