రాహుల్‌ గాంధీపై పోలీసుల దురుసు ప్రవర్తన

By Kotireddy Palukuri Oct. 01, 2020, 08:00 pm IST
రాహుల్‌ గాంధీపై పోలీసుల దురుసు ప్రవర్తన

కాంగ్రెస్‌ పార్టీ యువ నేత రాహుల్‌ గాంధీపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరు కారణంగా రాహుల్‌ గాంధీ కింద పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో అమానవీయంగా జరిగిన హత్రాస్‌ అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్‌ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరారు.

అయితే వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు కాంగ్రెస్‌ యువ నేతలను యుమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై అడ్డుకున్నారు. తాము బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళతామంటూ రాహుల్, ప్రియాంక కాలినడక ప్రారంభించారు. వారిని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అనుసరించారు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి రాహుల్, ప్రియాంకలను అడ్డుకున్నారు. ఇరు పక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రాహుల్‌ గాంధీని నెట్టడడంతో ఆయన కింద పడిపోయారు.


పోలీసుల తీరుపై రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. పోలీసులు వ్యవహరించిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు తనను తోసేయడంతోపాటు లాఠీ ఛార్జీ చేశారని మండిపడ్డారు. తనను ఏ చట్టం కింద అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోడ్డుపై మోదీనే నడవలా..? సామాన్యులు నడవకూడదా..? అని ప్రశ్నించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp