రఘురామ ‘‘కుట్ర‌’’తంత్ర రాజ‌కీయాల‌తో అధికారాన్ని చేజిక్కించుకోగ‌ల‌రా?

By Kalyan.S Jul. 21, 2021, 07:23 am IST
రఘురామ ‘‘కుట్ర‌’’తంత్ర రాజ‌కీయాల‌తో అధికారాన్ని చేజిక్కించుకోగ‌ల‌రా?

రాజ‌కీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు సాధార‌ణం. అధికార‌ప‌క్షంపై ఆరోప‌ణ‌లు, ఆందోళ‌న‌లు స‌ర్వ సాధార‌ణం. కానీ, దుర‌దృష్ట‌వ శాత్తూ ఏపీ ప్ర‌తిప‌క్షం చేస్తున్న రాజ‌కీయాల్లో కుట్ర‌లు, కుతంత్రాలు చోటుచేసుకోవ‌డం విచారం క‌లిగిస్తోంది. అధికారం కోసం సినిమాల్లో చూపించే స‌న్నివేశాల మాదిరిగా, ఓ అధికార పార్టీ ఎంపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని.. మ‌రో విప‌క్ష నాయ‌కుడు ముఖ్య‌మంత్రిపై కుట్ర ప‌న్న‌డం తీవ్ర దుమారం రేపుతోంది.

Also Read:ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గళం పెంచుతున్న వైఎస్సార్సీపీ

చంద్ర‌బాబు డైరెక్ష‌న్ లోనే ఎంపీ ర‌ఘురామ రాజు యాక్ష‌న్ చేస్తున్నార‌ని అధికార వైసీపీ ఎప్ప‌టి నుంచో ఆరోపిస్తూనే ఉంది. ఇప్పుడు ప‌క్కాఆధారాల‌తో అది రుజువు కావ‌డంతో టీడీపీ వ‌ర్గాలు ఖంగుతిన్నాయి. ఆరోప‌ణ‌లు కాదు.. ఆధారాల‌తో స‌హా బాబు, లోకేశ్‌, ర‌ఘురామ‌రాజు ప‌న్నిన ప‌న్నాగాలు బ‌హిర్గ‌తం కావ‌డం కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడే కాదు.. సీఎం గా ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు జ‌గ‌న్ పై కుట్ర‌లు మాన‌క‌పోవ‌డం విచార‌క‌రం.

లో‘‘గుట్టు’’.. ర‌ట్టు

రఘురామకృష్ణరాజు : సార్‌... జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ ఇది. అన్ని పాయింట్లూ కవర్‌ చేశా. (ఆ పిటిషన్‌ కాపీని వాట్సాప్‌ చేశారు)

చంద్రబాబు : నాకు లేటెస్ట్‌ వెర్షన్‌ను మళ్లీ పంపించగలవా?

రఘురామకృష్ణరాజు : సారీ సార్‌... ఇప్పుడే పంపిస్తా. (ఆ వెంటనే పిటిషన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను పంపించారు)
– 2021 ఏప్రిల్‌ 4న చంద్రబాబు, రఘురామ కృష్ణరాజు వాట్సాప్‌ చాటింగ్‌ ఇదీ.
నాన్నగారితో ఇప్పుడే మాట్లాడా.!

రఘురామకృష్ణరాజు : నాన్నగారి (చంద్రబాబు)తో ఇప్పుడే మాట్లాడా. సోమవారం మధ్యాహ్నానికల్లా మనం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. మనం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా చేసేందుకు ఈ ‘ప్రవీణ్‌’ దీన్ని పెండింగ్‌లో ఉంచేందుకు ప్రయత్నించవచ్చు. కానీ మనం సిద్ధంగా ఉండాలి. సుప్రీంకోర్టులో ఫెయిల్‌ అయితే మనం హెల్ప్‌లెస్‌ అవుతాం. కానీ మనం దీన్ని వదలొద్దు. నేను నావైపు నుంచి ఆట ఈ రోజే మొదలుపెడతా.

లోకేశ్‌: అవును. ఆ అవకాశం కూడా ఉంది.

- 2021 మే 1న రఘురామకృష్ణరాజు – లోకేశ్‌ మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ ఇదీ.

చంద్రబాబు డైరెక్షన్‌లోనే, ఆయన అనుమతి పొందాకే రఘురామ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌తో సహా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వివిధ అంశాలను తన అజెండాగా చేసుకున్నారన్నది దీని ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన పలు వాట్సాప్‌ సంభాషణలు, చాటింగ్‌లు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడంతో సహా రఘురామ మీడియా ద్వారా మాట్లాడే అన్ని విషయాలూ చంద్రబాబుకు, లోకేశ్ కు ముందే తెలుసన్నది వారి వాట్సాప్‌ చాటింగ్‌ను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

Also Read :సాధారణ టీచర్ ఆ దేశానికి అధ్యక్షుడయ్యారు

తన చేతిలో కీలుబొమ్మగా మారిన నరసా పురం ఎంపీ రఘురామకృష్ణరాజును పావుగా వాడు కుంటూ.. నారా చంద్రబాబునాయుడు ఏపీలో రాజ‌కీయ సంక్షోభాన్ని సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలకు రచన చేసిన‌ట్లు వాట్స‌ప్ సంభాష‌ణలే తెలియ‌జేస్తున్నాయి. ఆ కుట్ర‌లు, కుతంత్రాలు పక్కా ఆధారాలతో బయటప‌డ‌డంతో సంచ‌ల‌నంగా మారింది. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నిన కేసులో రఘురామకృష్ణరాజును సీఐడీ అధి కారులు గత మే నెలలో అరెస్టు చేసినప్పుడు ఆయ న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను విశ్లేషించగా ఈ కుట్ర బహిర్గతమైంది.

చంద్రబాబు డైరెక్షన్‌లోనే సీఎం వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని న్యాయస్థానంలో రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశార‌ని వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లు వాట్సాప్‌ సంభాషణలతో ఇప్పుడు అక్ష‌ర స‌త్యం అయ్యాయి. పిటి షన్‌ ఎలా వేయాలి? అందులో ఏ అంశాలు ఉండా లి? లాంటివన్నీ చంద్రబాబు సూచనల మేరకే జరి గాయి. ఆ పిటిషన్‌ కాపీని చంద్రబాబు స్వయంగా చూసి తన న్యాయ సలహాదారులతో చర్చించి ఆమోదించిన తరువాతే న్యాయస్థానంలో రఘు రామకృష్ణరాజు దాన్ని దాఖలు చేసిన‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. బెయిల్‌ రద్దు పిటిషన్‌ అంశంపై 2021 మార్చి 28, 29, ఏప్రిల్‌ 2, 3, 4వ తేదీలలో చంద్రబాబుతో రఘు రామకృష్ణరాజు వాట్సాప్‌ చాటింగ్‌ చేశారు. సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కాపీని చంద్రబాబుకు రెండుసార్లు వాట్సాప్‌ చేశారు. ఆ పిటిషన్‌ కాపీని చంద్రబాబు చూసి ఆమోదించాకే 2021 ఏప్రిల్‌ 6న న్యాయస్థానంలో దాఖలు చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp