కేవీపీ వ్యూహంలో భాగంగానే విందు రాజకీయం నడుస్తోందా.?

By Amar S Dec. 10, 2019, 06:53 pm IST
కేవీపీ వ్యూహంలో భాగంగానే విందు రాజకీయం నడుస్తోందా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణం రాజుకు ఇటీవల ఏదైనా కొత్త పదవి వచ్చిందా.? ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందా.? ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించారా.? ఇవేమీ కాదే.. మరి భారీఎత్తున పార్టీ ఎందుకు ఇస్తున్నారు.?

ఢిల్లీలో ప్రధాని మోడి, బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షా, దేశవ్యాప్తంగా దాదాపుగా 100మంది ఎంపీలు, సినీ వ్యాపార ప్రముఖులను ఎందుకు ఆహ్వానించినట్టు అని అందరూ చర్చించుకుంటున్నారు.. మొత్తం వందరకాల వంటకాలతో తన వియ్యంకుడైన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో 11వతేదనీ భారీగా విందు ఇస్తున్నారు..దేశంలోని అన్ని ప్రాంతాల ట్రెడిషన్ వంటకాలతోపాటు వెజ్‌, నాన్‌వెజ్‌, చైనా, అమెరికా, జ‌పాన్, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ బిర్యానీ వంటలు సిద్ధం చేస్తున్నారట. వెయ్యి రూపాయల విలువైన కిళ్లీ ప్రత్యేకమని అందరూ దీనిగురించే మాట్లాడుకుంటున్నారు. అయితే రఘురామకృష్ణంరాజు ఈ విందును ఓ ముప్పై నలభై మందితో ఏర్పాటు చేయలేదు. దాదాపుగా మూడువేల మంది అతిధులను పిలిచి భారీగా చేస్తుండడం.. అతిధుల జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రివర్గం ఉండడంతో రఘురామకృష్ణంరాజు విందుపై వైఎస్సార్సీపీ మాత్రం సైలెంట్ గా ఉంది.

Read Also : వైశ్రాయ్ - స్పీకర్ పశ్చాత్తాపం

రఘురాజు వ్యక్తిగతంగా పార్టీకి సంబంధం లేకుండా ఈ విందు ఏర్పాటు చేస్తున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరూ పార్టీ పర్మిషన్ లేకుండా ఢిల్లీలో ఎవర్నీ కలవొద్దని, పార్టీపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తుంటే రఘురాజు ఏకంగా అందర్నీ పిలిచి విందు ఇస్తున్నారు. మరోవైపు రఘురాజు వ్యవహారశైలి గత కొద్దిరోజులుగా పార్టీకి భిన్నంగా ఉండడం.. బీజేపీతో ఆయన సన్నిహితంగా మెలుగుతుండడంతో సీఎం జగన్ వ్యూహాత్మకంగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంనుంచి గోకరాజు గంగరాజు కుటుంబాన్ని పార్టీలో చేర్చుకున్నారు. గోకరాజు గంగరాజు రఘురాజుకు మావయ్య అవుతారు.

మొదటి సారి ఎంపీ అయిన రఘురాజుకు గత దశాబ్ధాల కాలంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. నరేంద్రమోడి ప్రధాని కాకముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటినుంచీ ఆయనకు సుపరిచయం.. ఈ పరిచయాలతోనే విందు ఇస్తున్నారని ఆయన వర్గం చెప్తోంది.

మొదటిసారి ఎంపీ అయినా రఘురాజు భిన్నమైన రాజకీయం చేస్తున్నారు.. స్వయానా ఆయన వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు వ్యూహాలు ఈయనకు పనికొస్తున్నాయని కొందరు చెప్తున్నారు. కేవీపీ కూడా రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో దిట్ట.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి కేవీపీ సలహాదారుడిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉత్పన్నమయిన పరిణామాల నేపధ్యంలో విందు రాజకీయానికి తెరతీసారా.. లేదా మరేదైన స్కెచ్ లో ఉన్నారా అనేది తెలియాల్సిఉంది.

Also Read: ప్రత్యూష ,ఆయేషా మీరా నుంచి దిశ వరకు ...

ముఖ్యంగా పార్ల‌మెంట్‌లో తెలుగు భాష‌ను కాపాడాల‌ని కోరిన‌ప్ప‌టి నుంచి రఘురాజు మీడియా దృష్టిలో పడ్డారు. ప్ర‌ధాని మోడీ రాజుగారు అని ఆప్యాయంగా పిలవడం.. బీజేపీ పార్ల‌మెంట‌రీ కార్యాల‌యంలోకి వెళ్ల‌డం.. నన్నెవడూ తిట్టడానికి సరిపోడంటూ మీడియాలో మాట్లాడడం.. ముఖ్యంగా ఢిల్లీలో ఆయన చేసే వ్యక్తిగత రాజకీయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కుదుపులు తెస్తోంది. ఈ క్రమంలో రఘురాజు విందు మరో సంచ‌ల‌నానికి దారి తీస్తోంది. పార్ల‌మెంట్‌లో జ‌గ‌న్ నిర్ణ‌యానికి విరుద్ధంగా ఆయ‌న మాట్లాడారని, ప్ర‌ధాని, హోంమంత్రిల‌తో అయ్యారని, పార్టీ ఆదేశాలను బేఖాతరు చేయడం పట్ల వైసీపీ ఆగ్రహిస్తోంది. ఇలాంటి సందర్భంలో తనకు అధికారిక నివాసం లేకపోయినా వియ్యంకుడి ఇంట్లో దేశమంతటికీ ఆయన విందు ఇవ్వడం మరిన్ని సంచలనాలకు దారితీసేలా కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp