వాళ్ళు గుండెలపై చేయి వేసుకుని చెప్పాలి: ఆర్.నారాయణమూర్తి

By Kotireddy Palukuri 16-11-2019 07:53 AM
వాళ్ళు గుండెలపై చేయి వేసుకుని చెప్పాలి: ఆర్.నారాయణమూర్తి

సామజిక అంశాలే ఇతివృత్తంగా చిత్రాలు నిర్మించే నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం భోదనకు జై కొట్టారు. ఇంగ్లీష్ ను 100 శాతం తప్పని సరి చేయడం వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. తెలుగును గౌరవిస్తూనే ఇంగ్లీష్ బోధనను అమలు చేయాలని సూచించారు. ఇంగ్లీష్ ఎందుకు అనే వారు తమ పిల్లలు, మనవళ్లను ఎక్కడ చదివిస్తున్నారో గుండెల పై చేయి వేసుకుని చెప్పాలన్నారు.

ఎన్నికలకు ముందు 'మార్కెట్లో ప్రజాస్వామ్యం ' అనే చిత్రాన్ని ఆర్. నారాయణ మూర్తి నిర్మించి, విడుదల చేశారు. మరో సారి ఈ చిత్రాన్ని విడుదలకు నారాయణ మూర్తి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 29న చిత్రం విడుదలకు తేదీ నిర్ణయించారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం నారాయణ మూర్తి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం లో ఇంగ్లీష్ మీడియం పై పై విధంగా స్పందించారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News