బహిరంగ శిక్షలు అమలు చేయాలి- పవన్ కళ్యాణ్

By Kiran.G Dec. 06, 2019, 03:01 pm IST
బహిరంగ శిక్షలు అమలు చేయాలి- పవన్ కళ్యాణ్

ఆ కాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనే అని ఆయన చెప్పారు.మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసుల్లో రెండు మూడు వారాల్లో దోషులకు శిక్షలు పడే విధంగా నిబంధనలు తీసుకురావాలని జనసేనాని తెలిపారు. ఆడపిల్లల శ్రేయస్సు మేరకు బహిరంగ శిక్షలు అమలు చేయాలని, నేర తీవ్రతను బట్టి అది మరణ శిక్ష అయినామరే శిక్ష అయినా సరే బహిరంగంగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.

Read Also: బేబి స్టెప్స్ ఇప్పుడే మొదలయ్యాయి - దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై రేణుదేశాయి.

హైదరాబాద్ శివారులో జరిగిన దారుణ ఘటన ఆడపడుచుల రక్షణకు ఇప్పుడున్న చట్టాలు సరిపోవడం లేదని హెచ్చరిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. నిర్భయ ఉదంతం తర్వాత బలమైన చట్టాన్ని పార్లమెంటులో చేసినా సరే అత్యాచారాలు ఆగడం లేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేసారు. ఇంకా కఠిన చట్టాల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల్లో చట్టాలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం మేధావులు ముందుకు రావాలని పవన్ విజ్ఞప్తి చేసారు. ప్రజలు కోరుకున్న విధంగానే దిశకు సత్వర న్యాయం జరిగిందని, దిశ ఆత్మకు శాంతి కలగాలని,ఈ విషాదం నుండి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అయితే గతంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసిన వారికి రెండు బెత్తం దెబ్బలు చాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp