విద్యార్థినుల లో దుస్తులు విప్పించి మరీ పరీక్షించిన ప్రిన్సిపాల్

By Kiran.G Feb. 14, 2020, 07:01 pm IST
విద్యార్థినుల లో దుస్తులు విప్పించి మరీ పరీక్షించిన ప్రిన్సిపాల్

పేరుకే మనం ఆధునిక యుగంలో ఉంటున్నాం.. కానీ కొన్ని ఆచారాలు సంప్రదాయాల పేరుతో ఒక్కోసారి మనుషులమనే విషయాన్నీ మర్చిపోతున్నాం. రుతుస్రావం జరిగేటప్పుడు ఆడవారిని బయట ఉంచే సంప్రదాయం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది.. కానీ పేరుమోసిన కాలేజీలో రుతుస్రావ రోజుల్లో కాలేజీలోకి అడుగుపెట్టారేమో అన్న అనుమానంతో విద్యార్థినిల లో దుస్తులు విప్పించి మరీ పరీక్షిస్తే ఎలా ఉంటుంది..

వినడానికే అసహ్యంగా ఉంది కదా.. కానీ ఈ సంఘటన నిజంగా జరిగింది.. గుజరాత్ లో శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ లో 68 మంది డిగ్రీ విద్యార్థినులు ఉన్నారు.. ఆ కళాశాలలో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.. రుతుస్రావం జరిగే రోజుల్లో హాస్టల్ కిచెన్ వైపు, అక్కడున్న ఆలయం వైపు రాకూడదు.. తోటి విద్యార్థినులతో కలువకూడదు.. ఇలా ఉన్నాయ్ అక్కడ రూల్స్..

కానీ హాస్టల్ ని చూసుకునే రెక్టర్ అంజలిబెన్ కు అక్కడి విద్యార్థినులపై అనుమానం వచ్చింది.. నెలసరి సమయంలో కూడా తోటి విద్యార్థినులతో కలుస్తున్నారని, కళాశాలకు వెళ్తున్నారన్న అనుమానంతో కాలేజీ ప్రిన్సిపాల్ కి పిర్యాదు చేసింది. దీంతో ప్రిన్సిపాల్ రీటా రానింగా విద్యార్థినులను బాత్రూమ్ కి తీసుకెళ్లి వారి లో దుస్తులను విప్పించి చెక్ చేసింది.. దీనిపై విశ్వవిద్యాలయం యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడయిన ప్రవీణ్ పిండోరియాకు పిర్యాదు చేస్తే ఈ సంఘటనపై పిర్యాదు చేసుకోవచ్చని కానీ అంతకంటే ముందు కళాశాలను, హాస్టల్ ను ఖాళీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించడంతో విద్యార్థినులకు ఏం చేయాలో పాలు పోలేదు..

దీనిపై విద్యార్థినులు పోలీసులకు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు.. ఇది మతపరమైన విషయం కాబట్టి కంప్లైంట్ ఇవ్వకూడదని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసారని కొందరు విద్యార్థినులు వ్యాఖ్యానించడం గమనార్హం.. ఈ సంఘటన గురించి బయటకు పొక్కడంతో సదరు కళాశాల యాజమాన్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp