తిరుమలలో రాష్ట్రపతి.. వెంకన్న దర్శనం అనంతరం..

రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమలలో గడిపారు. సతీసమేతంగా ఈ రోజు ఉదయం తిరుమలకు వచ్చిన రామ్నాథ్ కోవింద్ మొదట తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. వేత సత్కారం అందుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత రాష్ట్రపతి దంపతులు వరాహస్వామి వారిని దర్శించుకున్నారు.
మధ్యాహ్నం శ్రీ వెంకటేశ్వర సామిని దర్శించుకునేందుకు రాష్ట్రపతి దంపతులు వెళ్లారు. వారికి ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. దర్శనం తర్వాత రామ్నాథ్ కోవింద్ దంపతులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
అంతకు ముందు రాష్ట్రపతికి గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక సందర్భంగా తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుమలలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులకు సర్వదర్శనం నిలిపివేశారు. సాయంత్రం తిరుమల నుంచి రాష్ట్రపతి చెన్నై బయలుదేరి వెళ్లారు.


Click Here and join us to get our latest updates through WhatsApp