మధ్యప్రదేశ్‌లో ముదిరిన పోస్టర్ల యుద్ధం

By Srinivas Racharla May. 25, 2020, 07:42 pm IST
మధ్యప్రదేశ్‌లో ముదిరిన పోస్టర్ల యుద్ధం

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పోస్టర్ల యుద్ధం నడుస్తుంది. గత మార్చిలో కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి మారిన మాజీ గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా,మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్,ఆయన కుమారుడు నకుల్ పోస్టర్లు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దర్శనమిస్తున్నాయి.

గ్వాలియర్‌లోని సింధియా చెందిన జై విలాస్ ప్యాలెస్‌ గేట్స్ వెలుపల 5,100 రూపాయల రివార్డును అందించే పోస్టర్‌ను కాంగ్రెస్ నాయకులు అతికించగా, నాకుల్ ఎంపిగా ఉన్న చింద్వారా ప్రాంతంలో అతని తండ్రితో పాటు అతను ఉన్న పోస్టర్లు వెలిశాయి. తప్పిపోయిన నాథ్ ద్వయాన్ని కనుగొంటే రూ .21 వేలను 'రివార్డ్' గా ప్రకటిస్తూ బిజెపి పోస్టర్‌లు వేశారు.

శనివారం నాడు మాజీ సీఎం కమల్ నాథ్ కార్యాలయం చింద్వారా పర్యటన కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించింది. ఖాళీగా ఉన్న 24 అసెంబ్లీ స్థానాలలో పదహారు,బిజెపి పార్టీలోకి జంప్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల 22 స్థానాలలో మెజారిటీ నియోజకవర్గాలు గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో ఉన్నాయి. సుమారు రెండు దశాబ్దాల తరువాత సింధియా కుటుంబ సభ్యులు లేకుండా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేస్తుంది. దివంగత ప్రధాని పి.వి.నరసింహారావు పాలనలో జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ్ రావు సింధియా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. కానీ ఆ సమయంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు.

గత అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రాంతంలో కాంగ్రెస్ గరిష్ట స్థానాలు గెలవడానికి సహాయ పడ్డ జ్యోతిరాదిత్య ఈ ఏడాది మార్చిలో తన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలతో సహా బిజెపి పార్టీలో చేరాడు. దీంతో కమల్ నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బలం లేక మార్చి 20న కూలిపోయింది. వెంటనే మార్చి 23న బిజెపికి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ సందర్భంగా సింధియా మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ పోస్టర్లు వేశారు.

అప్పటినుండి మొదలైన పోస్టర్ల యుద్ధం అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలోపతాక స్థాయికి చేరింది.భోపాల్ పార్లమెంటు సభ్యుడు ప్రగ్యా సింగ్ ఠాకూర్ సమాచారం కోసం రివార్డ్ ప్రకటిస్తూ పోస్టర్ యుద్ధాన్ని కాంగ్రెస్ నాయకుడు రవి సక్సేనా ప్రారంభించినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. బిజెపి కార్యకర్తలు ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నాయకుడు సిద్ధార్థ్ సింగ్ రాజవత్‌ను అరెస్టు చేసినట్లు ఝాన్సీ రోడ్ పోలీస్ స్టేషన్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎం రాజోరియా తెలిపారు. సమాజంలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే రాజకీయ కార్యకలాపాలకు పాల్పడినందున రాజావత్‌ను ఐపిసి సెక్షన్ 188, 505 (1) (సి) కింద అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp