డ్యూటీ ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్!!

By Nehru.T Sep. 26, 2020, 05:10 pm IST
డ్యూటీ ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్!!

భారీ వానలోనూ కర్తవ్యాన్ని మరువని పోలీస్!!

అభినందించిన ఎస్పీ

నువ్ చేయాల్సిన పని సక్రమంగా చేసుకుంటూ వెళ్లు.. మిగతాదంతా నేను చూసుకుంటాను అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పినదాన్ని అనుసరించి చిత్తశుద్ధితో పని చేసేవాళ్లను ఒకనాడు కాకుంటే ఇంకో రోజయినా అభినందించాల్సిందే. భారీ వాన కురుస్తున్న విధి నిర్వహణను మరువకుండా సెంటర్లో నిలబడి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న ఓ కానిస్టేబుల్ ను ప్రభుత్వం గుర్తించింది. హోమ్ మంత్రి, డిజిపి కూడా అభినందించారు. ఎస్పీ తన వద్దకు పిలిపించి మరీ శాలువా కప్పి సత్కరించారు.

ఆకాశం చిల్లు పడిందా ..సముద్రం వర్షిస్తోందా అన్నంతగా వాన కురుస్తున్నాప్పటికి శుక్రవారం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద
అన్నట్లుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీనివాస్ నదిరోడ్డుమీద నిలబడి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఇది పలువురి దృష్టిని ఆకర్షించింది. నిలువునా తడుస్తూ ఆయన విధుల్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. వీటిని చూసిన హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ సామాజిక మాధ్యమం వేదికగా కానిస్టేబుల్ ను అభినందించారు. ఇక
జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు శనివారం

జిల్లా పోలీసు కార్యాలయం లో శ్రీనివాస్ ను సత్కరించి తను చేసిన సేవకు ప్రోత్సాహకంగా నగదు రివార్డును అందజేసి అభినందనలు తెలిపారు. కానిస్టేబుల్ చిత్తశుద్ధిని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp