అది గొప్పదా...ఇది గొప్పదా ? నాటి బాబు వైఖరి నేటికీ మిస్టరీయే..!

By Voleti Divakar Oct. 30, 2020, 07:17 am IST
అది గొప్పదా...ఇది గొప్పదా ? నాటి బాబు వైఖరి నేటికీ మిస్టరీయే..!

పార్లమెంటులో చేసిన చట్టం గొప్పదా... ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్య జరిగిన ఒప్పందం, కేబినెట్ చేసిన తీర్మానం గొప్పదా అని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. చట్టంలో పేర్కొనలేదని ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎండగట్టారు. ఇప్పటికీ చంద్రబాబునాయుడు నాటి ఒప్పందం గురించి స్పష్టమైన సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ఎపి పునర్విభజన చట్టంలో పొందుపరిచిన జీవనాడి పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తన వంతు కృషిచేస్తున్న ఉండవల్లి విలేఖర్ల సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు వెలడించారు.

తాజాగా మాజీ ఎంపీ అరుణ్ కుమార్ పోలవరానికి పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.. ఇప్పటి వరకు ఆయన పోలవరం ప్రాజెక్టుపై 27సార్లు విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, 3సార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్మాణం నిబంధనల ప్రకారం పక్కాగానే ఉందని,, కాంట్రాక్టు విషయంలోనే లోపాయికారీ వ్యవహారాలే జరుగుతాయన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీయే పోలవరం ప్రాజెక్టును ఎటిఎంలా వాడుకుంటున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారని ఆయన గుర్తుచేశారు. భూసేకరణ, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన అంచనాలు గణనీయంగా పెంచేశారన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నూరుశాతం నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు 2013 నాటి అంచనాల ప్రకారమే నిధులు మంజూరు చేస్తామన్న కేంద్ర వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. రూపాయికి 60 పైసలు మాత్రమే కేంద్రం మంజూరు చేస్తోందన్నారు. కెబికె తరహా ప్యాకేజీ, రాయల సీమ, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ఎగొట్టి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు ఆపేస్తే ఎపి పరిస్థితి అగమ్యగోచరమేనని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన కాటన్ దొర కూడా పోలవరం వద్ద ప్రాజెక్టు నిర్మించుకుంటే ఎంతో మంచిదని సూచించారని ఉండవల్లి చెప్పారు. టిడిపి ప్రభుత్వం రూ. 1800కోట్లతో పట్టి సీమ ప్రాజెక్టును చేపట్టకపోతే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేదన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు హైకోర్టులో వేసిన పిల్ లో తాను కూడా ఇంప్లీడై, స్వయంగా వాదించేందుకు సిద్దమయ్యానన్నారు. ఆరేళ్లుగా ఈకేసులో ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయకపోవడం గర్హనీయమన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp