నా భర్తకు ఈ భూమిపై బ్రతికే హక్కు లేదు ఉరిశిక్ష విధించండి

By Kiran.G Aug. 04, 2020, 05:49 pm IST
నా భర్తకు ఈ భూమిపై బ్రతికే హక్కు లేదు ఉరిశిక్ష విధించండి

కామాంధుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తించిన చిన్నారి హత్య కేసులో నిందితుడు పెంటయ్యకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే 2019 నవంబర్‌ 10న విజయవాడ గొల్లపూడిలోని ఇంటి వద్ద ఆడుకుంటున్న ద్వారక అనే చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు పెంటయ్య ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. పోలీసుల విచారణలో పెంటయ్య చిన్నారి ద్వారకను హత్యాచారం సాక్ష్యాధారాలు లభించాయి. దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన స్పెషల్ పోక్సో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

విచారణలో భాగంగా 35 మంది సాక్షులను విచారించిన స్పెషల్ కోర్టు పెంటయ్య నేరానికి పాల్పడినట్లు నిర్దారించింది. నిందితుడి భార్య సైతం ఇలాంటి వ్యక్తికి సమాజంలో బ్రతికే అవకాశం ఇవ్వకూడదని ఉరి శిక్ష విధించాలని న్యాయమూర్తిని కోరడం గమనార్హం.. హత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి ప్రతిభాదేవి తీర్పునిచ్చారు.కోర్టు తీర్పుపై హత్యకు గురైన చిన్నారి ద్వారక తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. నిందితుడికి సరైన శిక్ష పడిందని వ్యాఖ్యానించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp