రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ.. కీలక అంశాలపై చర్చలు

By Kalyan.S Jul. 05, 2020, 08:55 pm IST
రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ.. కీలక అంశాలపై చర్చలు

చైనాతో సరిహద్దుల వివాదం అనంతరం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ, విదేశీ ప్రముఖులతో తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడితో మాట్లాడిన ఆయన పలు అంశాలపై చర్చించారు. శిఖోయ్ యుద్ధ విమానాల పై ఆమోదం పొందారు. అలాగే పుతిన్ మరో 16 ఏళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగే విధంగా ఆ దేశ రాజ్యాంగం లో ఆమోదం పొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భారత్ - చైనా సరిహద్దుల్లో ఆకస్మికంగా పర్యటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. సైని కు లతో మాట్లాడి వారిలో ఆత్మ స్థైర్యం నింపారు.

తాజాగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో మోడీ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి వీరు చర్చించినట్టుగా అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో చైనాతో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా జూన్‌ 15న గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు అమరులయ్యారు. ఆ ఘటనలో గాయపడి.. లేహ్‌లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను కూడా ఇటీవల మోడీ పరామర్శించారు. అలాగే నిములో ఉన్న ఫార్మర్డ్‌ పోస్ట్‌ వద్ద భారతీయ సైనిక, వైమానిక, ఐటీబీపీ దళాలనుద్దేశించి ఉద్వేగపూరితంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. మరోవైపు ఆర్మీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో మోదీ, రాష్ట్రపతితో భేటీ చర్చనీయాంశంగా మారింది.

ఈ భేటీకి సంబంధించి రాష్ట్రపతి భవన్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ కూడా చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించినట్లు పేర్కొంది. ఈ చర్చల్లో మన సైనిక బలగాలు, నూతనంగా కేంద్రం తీసుకున్న చర్యల ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. అలాగే రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కట్టడికి.. దీనికి గల కారణాలపై కూడా రాష్ట్ర పతి కోవింద్ మోడీని వివరాలు అడిగి తెలుసుకు న్నట్లు తెలిసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp