73 ఏళ్ల వయసులో పీ హెచ్ డి పట్టా సాధించిన వీరభద్రయ్య

By Suresh Dec. 08, 2019, 11:41 am IST
73 ఏళ్ల వయసులో పీ హెచ్ డి పట్టా సాధించిన వీరభద్రయ్య

చదువుకు, వయసుకు ఏ మాత్రం సంబంధం లేదని నిరూపించాడు సీనియర్ శాస్త్రవేత్త వీరభద్రయ్య. 73 ఏళ్ల వయసులో పీ హెచ్ డి పట్టాను సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

32 ఏళ్లపాటు పాటు శాస్త్రవేత్తగా ఎన్ ఎస్ టి ఎల్ లో పని చేశారు.పదవీ విరమణ అనంతరం పదేళ్ల పాటు రఘు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేశారు.

ఈ క్రమంలో ఆచార్య మల్లెల పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో పరిశోధన చేపట్టి ఆంధ్రా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం సిస్టం డిజైన్ లో 73 ఏళ్ల వయసుగల వీరభద్రయ్య శనివారం పీ హెచ్ డి డిగ్రీని పొందారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp