అదునాతన 108కు రఘువీరా రెడ్డి సలాం..!

By Mavuri S Apr. 16, 2021, 09:00 pm IST
అదునాతన 108కు రఘువీరా రెడ్డి సలాం..!

ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఆశ, భవిష్యత్తు విజన్, పేదలకు సైతం ఉచితంగా అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి చేరుకునే సౌలభ్యం అన్నీ కలగలపి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రికగా ఆంధ్రప్రదేశ్ లో మొదలైన ఆరోగ్య మహాయజ్ఞము 108 అంబులెన్స్ లు. ఈ అంబులెన్సులు ద్వారా ఇప్పటి వరకు వేలాది ప్రాణాలు నిలబడ్డాయి. ఎందరికో వ్యాపకాలను టక్కున గుర్తొచ్చే నెంబర్ గా 108 ప్రసిద్ధి కెక్కింది.

వీటి నిర్వహణలో ప్రస్తుత ప్రభుత్వం, ఆధునికత జోడించి మరింత సమర్ధంగా నిర్వ హిస్తున్న తీరును కాంగ్రెస్ నాయకుడు, వైఎస్ఆర్ హయాంలో నాటి కేబినెట్ లో కీలక మినిస్టర్ అయిన రఘువీరారెడ్డి అనంతపురంలోని తన స్వగ్రామం నీలకంఠ పురం లో శుక్రవారం అంబులెన్సులను పరిశీలించారు. ఎంతో అద్భుతమైన పనితీరును, ఆధునిక యంత్రాల మేళవింపుతో ఉన్న వీటి సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, దివంగత నేతను మరోసారి తలుచుకున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏ పథకం ప్రవేశ పెట్టిన పేదల ప్రయోజనం దానిలో తప్పకుండా ఉంటుంది. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత, 2005లో సత్యం రామలింగరాజు తన కార్పొరేటు రెస్పాన్సిబులిటీ కింద ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేద్దామని భావించినప్పుడు, రాజశేఖర్ రెడ్డి మాత్రం చరిత్రలో గుర్తుండిపోయేలా ఓ కార్యక్రమం మీరు నిర్వహించాలని సత్యం రామలింగరాజుకు సూచించారు. దానికి రామలింగరాజు అంగీకరించి ప్రభుత్వం ఎలాంటి మంచి కార్యక్రమం తీసుకున్నా దానికి కచ్చితంగా మద్దతు ఉంటుందని ప్రకటించారు.

దీనిలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైద్యుడు కూడా కావడంతో పేదలకు అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండేలా, వైద్యంలో గోల్డెన్ అవర్ కు ముందే రోగిని ఆసుపత్రికి తీసుకు వస్తే ఎంత ప్రయోజనమో తెలిసిన ఆయన ఏదైనా సంఘటన లేదా ఆరోగ్యం సరిగా లేనప్పుడు వెనువెంటనే ఒక్క ఫోన్ కాల్ తో అంబులెన్సు వచ్చేలా ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేయమని తన టీంకు చెప్పారు. ఇలా రూపుదిద్దుకొన్నదే 108. దీనికి సంబంధించి మొదట్లో సత్యం గ్రూపు అంబులెన్సులను ప్రభుత్వానికి విరాళంగా అందించింది నిర్వహణ బాధ్యతలను చూసుకుంది.

సత్యం గ్రూపు తర్వాత దాని నిర్వహణ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టింది. అత్యద్భుతమైన స్పందన రావడంతో పాటు ఇప్పటి వరకు సుమారు 14.50 లక్షల ప్రాణాలను గోల్డెన్ అవర్లో కాపాడిన ఘనత కూడా 108 కు దక్కుతుంది. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ అంబులెన్సులు ప్రతి పేదవాడికి ఆరోగ్య భద్రత ను భరోసాను కల్పించాయి.

Also Read : కరోనా సెకండ్ వేవ్ : ఏపీలోనే సేఫ్ అని ఎందుకు భావిస్తున్నారు..?

ఆంధ్రప్రదేశ్ లో భారీగా విజయవంతమైన 108 అంబులెన్స్ సర్వీసులను తర్వాత దేశమంతా విస్తరించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. దీంతో ఒక్కో రాష్ట్రం తన అత్యవసర సేవల విభాగంలో 108 చేరుస్తూ వచ్చింది. ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో 108 సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు సైతం త్వరలోనే వీటిని పరిచయం చేసేందుకు ఆలోచిస్తున్నాయి.

108 అంబులెన్సులను కేవలం రోగి నీ ఆస్పత్రికి తీసే కెళ్ళే వాహనం కింద వదిలేయలేదు. దానిలో అత్యాధునిక యంత్రాలను ప్రత్యేకమైన మెడికల్ సిబ్బందిని నియమించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే చెల్లింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వీటి నిర్వహణ తూతూ మంత్రంగానే సాగినా, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 108 అంబులెన్స్లు సుమారు 1400 వరకు కొత్తవి కొనుగోలు చేశారు. దీనిలో అత్యాధునిక యంత్రాలను ఉంచారు. రోగి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ఎక్కిన దగ్గర నుంచి అతనికి వైద్య సహాయం అందేలా, దానికి తగిన సెటప్ ను ఉంచారు. ఈనాడు మరో ముందడుగు వేసి అధునాతన మైన బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి.

అనంతపురం జిల్లా గుడిబండ మండలం PHC లో అప్పుడే పుట్టిన బిడ్డ శ్వాస తీసుకోవడం లో కష్టంగా ఉన్నందున గుడిబండ నుండి 108 లో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వెనుతిరిగి వస్తున్న సందర్భంలో108 వహనం నీలకంఠాపురం గ్రామంలో రఘువీరా రెడ్డి కి కనిపించింది. 108 వాహనం స్థితిగతులు, వాహనంలో ఉన్న పరికరాల గురించి వాహన లో ఉన్న పైలెట్లను ఈ.ఎం.టి లను అడిగి అందులో ఉన్న అధునాతన మైన బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ల లో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు, BP పేసేంట్లకు ఏర్పాటు చేసిన సిరేంజ్ ఇన్ఫోయూజ్ పంపు మరియు పాయిజన్ ఫిట్స్ కేసులకు ఏర్పాటు చేసిన తక్షణ అపరేటర్స్ సదుపాయాలను చూసిన ఆయన ముచ్చట పడ్డారు.

దేశంలో మరెక్కడా లేనివిధంగా అంబులెన్స్లో నిర్వహణ చేయడం పట్ల, ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముందుచూపు పట్ల ఆయన అబ్బుర పడ్డారు. అందుకే అంటారు నాయకుడంటే ప్రజల కష్టనష్టాలు వారి అవసరాలు తెలిసినవాడే ఉండాలని... అది ఎప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి సాధ్యమంటూ రఘువీరారెడ్డి పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. నాడు వైఎస్ మొదలు పెట్టిన 108 ఈనాడు మరో ముందడుగు వేసి అధునాతన బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లుగా రూపుదిద్దుకొని ప్రజారోగ్యానికి ప్రాధాన్యతను యిస్తున్న తీరు సంతోషం కలిగించే విషయమని రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : ఏపీ టాప్ : నిర్ధార‌ణ‌లోనే కాదు.. నివార‌ణ‌లో కూడా..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp