నేడు ఢిల్లీకి పవన్ - అమరవీరుల సంక్షేమ నిధికి కోటి విరాళం

By Nehru.T Feb. 20, 2020, 12:31 pm IST
నేడు ఢిల్లీకి పవన్ - అమరవీరుల సంక్షేమ నిధికి కోటి విరాళం

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడాయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్రీయసైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమర సైనికవీరుల కుటుంబాలసంక్షేమానికి ప్రకటించిన కోటిరూపాయల చెక్కును అందచేస్తారు. ఇటీవల మిలిటరీ డే సందర్భంగా అమరసైనిక వీరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు

మధ్యాహ్నం విజ్ఞాన భవన్ లోజరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులోపాల్గొంటారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయనాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈకార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.విద్యార్థులసందేహాలకు సమాధానాలు ఇస్తారు. పవన్ కళ్యాణ్గురించి రూపొందించిన షార్ట్ ఫిలింను ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో మేఘాలయరాష్ట్ర శాసన సభ స్పీకర్ మెత్బా లింగ్డో , కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొంటారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp