కొత్త అంబులెన్సులు భేష్ -జగన్ కు పవన్ అభినందనలు

By Krishna Babu Jul. 03, 2020, 06:16 pm IST
కొత్త అంబులెన్సులు భేష్ -జగన్ కు పవన్ అభినందనలు

ముఖ్యమంత్రి జగన్ తీసుకువచ్చిన 108, 104 సర్వీసులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందిస్తు ట్విట్టర్ ద్వారా స్పందించారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం.. అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు - అభినందనీయం, ఇది ప్రపంచానికే గడ్డు కాలం, అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ, రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాలికి, సహకరిద్దాం - క్షేమంగా ఉందాం .. అంటూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఒక టీవి ఛానల్ లో ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నారు అని చెప్పిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ ఇలా స్పందించడం గమనార్హం.


ప్రభుత్వం పై ఎప్పుడు ఏదో ఒక విమర్శతో దాడి చేసే పవన్ కళ్యాణ్ నేడు ఈ విధంగా స్పందిచడం ఆశ్చర్యంగా ఉందని కొందరు అంటుంటే, ఈ అంబులెన్సుల వ్యవహారంలో దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల వర్షం కురుస్తున్న వేల తాను స్పందించలేని పక్షంలో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయనే ఆలొచనతోనే ట్వీట్ పెట్టారు అని మరొకొందరి అభిప్రాయం, ఏది ఏమైనా నిరాధారమైన విమర్శలు కాకుండా ప్రభుత్వం చేసే మంచిని మంచిగా, తప్పులని నిర్మాణాత్మకంగా ఎత్తి చూపిననాడే ఏ రాజకీయ పార్టీ అయిన ప్రజల్లో ఒక స్థానం సంపాదించుకుంటారనేది స్పష్టం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp