అసహనంలో పవన్ కళ్యాణ్

By Surya.K.R 17-11-2019 06:27 PM
అసహనంలో పవన్ కళ్యాణ్

ఈ మద్య దేశంలో రాజకీయనాయకులు తమ స్వలాభం కోసం, ఆధిపత్యం కోసం, ఓట్ల కోసం మత వైషమ్యాలను పెంచి పోషిస్తున్నారు అనేది మనకి కనిపిస్తూనే ఉంది. ఎల్లో మీడియా, తెలుగుదేశంతో పాటు ఇప్పుడు తాజాగా ఆ కోవలోకి పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయారు. జనసేన పార్టీ ఆవిర్భావం సంధర్భం గా మా పార్టీ సిద్దాంతం ఇది అంటూ 7 సిద్దాంతాలు చెప్పారు పవన్ కళ్యాణ్, అందులో మొదట రెండు సిద్దాంతాలు
1) కులాలు కలిపే ఆలోచన.
2) మతాల ప్రస్థావన లేని రాజకీయం.

కానీ పవన్ కల్యాణ్ గత కొద్ది రోజులుగా ఆ రెండు సిద్దాంతాలకు విరుద్ధంగా జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అనేది సుస్పష్టం. జగన్ ఏ రెడ్డి అంటారు, జగన్ క్రిష్టియన్ అయితే రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నారు అంటారు, జగన్ తిరపతి ప్రసాదం తింటారా లేదో నాకు తెలియదు అంటారు. (నిజంగానే తెలియదా, అంటే నమ్మేది ఏవరు?)

మన రాజ్యంగం ప్రకారం మన దేశం లౌకిక గణతంత్ర రాజ్యం , ఇక్కడ ఆర్టికల్ 25 ప్రకారం అందరికి మత స్వేచ్చ ఉన్నది, అది ప్రాధమిక హక్కులలో ఒకటి. ఒకరి మత స్వేచ్చని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. కాని పవన్ కల్యాణ్ మాత్రం జగన్ ని ఎదుర్కొనే మార్గాలు తోచక భారత రాజ్యంగం ఇచ్చిన మత స్వేచ్చ హక్కుకు భంగం కలిగేలా అతని మతం, కులం మీద విమర్శలు చేస్తున్నారు, నాకు చెగువేరా ఆదర్శం , నాకు భగత్ సింగ్ స్పూర్తి అంటూ చెప్పుకునే పవన్ కళ్యాణ్ తన పార్టీ సిద్దంతాన్ని తానే ధిక్కరిస్తూ, ప్రజా బలం సంపాదించటంలో జగన్ తో పొటీపడలేక అసూయ , అక్కసుతో ప్రవర్తించటం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నిజంగా జగన్ తిరుపతి ప్రసాదం తీసుకోరా అంటే, జగన్ ఏ కాదు వై.యస్ రాజశేఖర రెడ్డి కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా తిరుపతి స్వామివారి ప్రసాదం తీసున్న ఉదంతాలు కోకల్లలుగా ఉన్నాయి, ఆ కుటుంబం క్రైస్తవ మతం పుచుకున్నది కూడా జగన్ హయాములో కాదు భారత దేశానికి స్వాతంత్రం రాక ముందు ఆ కుటుంబం క్రైస్తవ్యాన్ని పుచ్చుకొంటే పవన్ కళ్యాణ్ జగన్ ని ఇప్పుడు ప్రశ్నిస్తాడు. (వారి ముత్తాతలు తీసుకున్న నిర్ణయానికి జగన్ ఏ విధంగా భాద్యుడు అనే జ్ఞానంకూడా లేకుండా విమర్శిస్తున్న తీరు దారుణంగానే ఉంది అనే వాదన వినిపిస్తున్నది ) జగన్ ని సైద్ధాంతికపరంగా ఎదుర్కొలేక ఇలా కులాన్ని మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడటానికి ముఖ్యకారణం పవన్ కళ్యాణ్ లో పెరుగుతున్న తీవ్రమైన అసహనమే కారణం అని పలువురి విశ్లేషణ .

నా కూతురు క్రిస్టియన్ అబ్బా అని ఎన్నికల ప్రచారంలో ఓ బహిరంగ సభలో చెప్పుకొన్న పవన్ , ఎన్నికల సమయంలో పలు చర్చ్ లు , గుళ్ళు , మసీదులు తిరిగి ఓట్లు అడిగిన పవన్ ఈ రోజు జగన్ కులమతాలకు అతీతంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే స్పృహ లేకుండా కుల మతాల కంపు అంటగడుతూ క్రిస్టియానిటీ , హిందూత్వాల మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం చేయడం చూస్తుంటే నిజ ప్రజాస్వామ్య వాదులకు పవన్ పై అసహ్యం వేయక మానదు .

జగన్ ప్రభుత్వం ఏర్పడగానే కేవలం 5 నెలలలో తెలుగుదేశం , బి.జే.పి ఒక మోటివ్ తో చేస్తున్న మత పరమైన విషప్రచారంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేయి కలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ లో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విషపురుగు దాగుందా అని సమాజం పట్ల భాద్యతగలిగినవారు ఆశ్చర్యపోతున్నారు. మన దేశ లౌకిక ప్రజాస్వామ్య స్పూర్తి నిలబడాలి అంటే ఇటువంటి రాజకీయ మతవాదులను, వైషమ్యాలు పెంచి పొషించే వారిని ప్రజలే దూరంగా పెట్టాలి అనే వాదన బలంగానే వినిపిస్తుంది, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ లో మార్పు వస్తుందా అంటే రాదనే చెప్పొచ్చు .

మొక్కై వంగనిది మానై వంగునా అని పవన్ రాజకీయ రంగ ప్రవేశం నుండి లక్ష్యం లేని ఆవేశం , ఎవరి పైనో తెలియని అసహనం , ఉచ్చనీచాలు ఎరగకుండా తీవ్ర వ్యాఖ్యలు చేసి అభిమానుల్ని రెచ్చగొట్టడం లాంటి పనులు ఈ పదేళ్లలో తగ్గిందీ లేదు . రాజకీయాల పట్ల ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిందీ లేదు . సమకాలీనుల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల అసూయ , ఆకారణ ద్వేషం పెంచుకొని ఎల్లో మాఫియా చేతిలో కీలుబొమ్మ అయిన పవన్ కళ్యాణ్ మారతాడని , ప్రజాపయోగ రాజకీయాలు చేయగలడని నమ్మకం లేకే గత ఎన్నికల్లో ప్రజలు దారుణ పరాభవాన్ని బహుమతిగా ఇచ్చారు . ఆ విషయం అందరికీ అర్థమైంది పవన్ కి తప్ప . బహుశా ఇంత అసహనం తొ ఉండే పవన్ కళ్యాణ్ కి ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News