కడపే ఒక గ్రంథాలయం పవన్ కళ్యాణ్

By Krishna Babu Dec. 05, 2019, 01:20 pm IST
కడపే ఒక గ్రంథాలయం పవన్ కళ్యాణ్

రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ రోజుకోక మాట మాట్లాడుతు అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నారు, అయితే తాజాగ కడప జిల్లా పర్యటనలో బాగంగా ఆయన కడపకి గ్రంథాలయం అంటే ఏంటో తెలియదు, నేను కడపలో గ్రంథాలయం పెడతా అని మాట్లాడారు, రెండు లక్షల పుస్తకాలు చదివాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కి 100 ఏళ్ళ క్రితమే కడపలో గ్రంథాలయాలు ఏర్పాటు చెసుకున్నరనే విషయం తెలియకపోవటం శోచనీయం, తెలుగునేలపై సాగిన గ్రంథాలయ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ముందుండి నడిపిన వ్యక్తులు రాయలసీమ వాసులు అన్న విషయం కూడా తెలియని పవన్ నేడు సీమ ఉద్దారకుడిలా మాట్లాడటం హాస్యస్పదం.

కడప జిల్లాలలో గ్రంథాలయాలు

మార్పు చైతన్యంకి చిహ్నం అంటారు, అటువంటి చైతన్య జ్వాల, రాయలసీమ జిల్లాలలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలలో 130 ఏళ్ల క్రితమే రగిలి గంథాలయాలే దేవాలయాలు అని గుర్తించి వాటి ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. గ్రంథాలకు సంకెళ్ళు వేసి కొందరికే చదువు అనే పద్దతి తో అట్టడుగు వర్గాలకు విజ్ఞానజ్యోతిని దూరం చేస్తున్న రోజుల్లోనే సామాన్యులకి సైతం విజ్ఞానాన్నిఅందుబాటులోకి తెచ్చే గ్రంథాలయాలు ఏర్పాటు చేసి, కడప జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ప్రజలను విద్యావంతులను చేసి చైతన్యవంతులను చేసే దిశగా సాగిన గ్రంథాలయ ఉద్యమంలో ఆనాడే కడపజిల్లా తన వంతు పాత్ర పొషించింది. రాజా రాంమోహన్ రాయ్ సంఘ సంస్కరణోద్యమం తో ఇంగ్లీషు చదువులు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, కడపలోనే సాహితీ వ్యాసాంగాన్ని కోనసాగించిన సి.పి బ్రౌన్ శభ్దకోశము, తద్వారా ముద్రించిన గ్రంథాలు, ప్రజలలో కూడా కొత్తమార్పులకు బీజంవేశాయి. దేశం అంతా మార్పుకు నాంది పలికి తొలి రొజుల్లోనే రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప జిల్లాలో ప్రజల సహకారంతో గ్రంథాలయ స్థాపన జరిగింది.

Read Also: పింక్..కాషాయం!

1881 లో జమ్మలమడుగు రెడ్డి జన గ్రంథాలయం కడప జిల్లాలో స్థాపించిన తొలి గ్రంథాలయం. 1884 లో ప్రొద్దుటూరు , 1889లో పులివెందులలో సరస్వతీ విలాసమందిరం అనే పేరు మీద గ్రంథాలయం ఏర్పడింది, 1892 లో రాయిచోటి లో మరో గ్రంథాలయం, ఇలా ఆనాడే ప్రజాబలంతో ఏర్పడిన గ్రంథాలయాలు ఎంతో ప్రశంశనీయంగా పనిచేసిన చరిత్ర ఉంది. ఈ విధంగా పౌర గ్రంథాలయాలు స్థాపన జరుగుతూ ఉండగా 1905లో జరిగిన బెంగాల్ విభజనతో ప్రజలలో అసహనం పెల్లుబికింది. స్వతంత్ర సమరానికి యువకులు సిద్దం అయ్యారు, చదవందే ఎవరు విప్లవవాది కాలేరు, విప్లవ భావాలను ప్రచారం చేయలేరుని చెప్పిన "కిం ఇల్ సుంగ్ నూంగ్" మాటలను ఆనాడే అందిపుచుకుని సాహిత్యం, ఫ్రెంచ్ ఉద్యమ చరిత్ర, సోవియట్ రాజకీయ పరిణామాలపై అధ్యయనం మొదలుపెట్టారు. ప్రజలే స్వచ్చందంగా అత్యధిక గ్రంథాలయాలు స్థాపించటం మొదలు పెట్తారు.

 ఆ గ్రంథాలయాలకు ప్రొత్సాహకరంగా ఉండే నిమిత్తం ఉద్యమ ప్రచారవాహినిగా నడిచే ఆంధ్ర పత్రిక, కాశినాథుని నాగేశ్వరరావు పంతులు గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణి చేశారు, కృష్ణ పత్రిక ముట్నూరి కృష్ణా రావు గారు కూడా అదే బాట పట్తారు, దీంతో రాయలసీమలో మరింత గా గ్రంథాలయాల స్థాపన ఉపందుకుంది, రాజంపేటలో 1906లో సుజనానంద గ్రంథాలయం, 1910లో కడపలో రామకృష్ణ పరమహంస మెమోరియల్ రీడింగ్ రూం , 1912 లో ప్రొద్దుటూరులో ఆంధ్రాభివృద్ది వర్ధిని సమాజం, 1917లో వివేకానందా ఫ్రీ లైబ్రరి అండ్ రీడీంగ్ రూం , 1919లో ప్రొద్దుటూరులో ఆర్యవైశ్య పఠనాలయం ఏర్పడ్డాయి.

Read Also: పారదర్శకత అంటే?

గ్రంథాలయ సంఘం

1914 నాటికి తెలుగునేలపై 200 పైచిలుకు గ్రంథాలయలు వెలిశాయి, ఈ గ్రంథాలయ నిర్వాహణలో సమన్వయం సాధించి గ్రంథాలయ ఉద్యమం వాడవాడలా వ్యాప్తి చేయడంలో, 1914లో జరిగిన ఆంద్రప్రదేశ్ గ్రంధాలయ మహాసభలను కడప ప్రతినిధులే ముందు ఉండి నడిపించారు, అదే స్పూర్తితో రాయలసీమలోనే 1916లో కడపజిల్లా ప్రొద్దుటూరులో జిల్లా గ్రంథాలయ సభలు, గాడిచర్ల వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ సభలకు వచ్చిన కొంతమంది యువకులు ఆ తరువాత కడప జిల్లా గ్రామ గ్రామాన గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. వారిలో ముఖ్యులు దుర్భా రాజశేఖరం, వేదం వెంకట కృష్ణ శర్మ, బద్రి సీతారమయ్య , బరూకు పిచ్చయ్య, గుళ్ళపల్లి పున్నయ్య శాస్త్రి ఉన్నారు.19వ దశకం తొలిపాదంలోనే గ్రంథాలయాలకు అనుబంధంగా వయోజన విద్యా కేంద్రాలు వెలిసాయి, ఈ కేంద్రాలను నిర్వహించి ప్రోత్సహించిన వారిలో గ్రంథాలయ ఉద్యమం త్రిమూర్తులలో ఒకరైన ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారు ముఖ్యులు. వీరు కడప మండలం సింహాద్రిపురం గ్రామ వాస్థవ్యులు. వీరు అయ్యంకి వెంకట రామయ్య , పాతురి నాగభూషణం తో కలిసి గ్రంథాలయ ఉద్యమానికి ఎనలేని సేవలు అందించారు. 1936లో ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘానికి అద్యక్షుగా నియమితులై జీవితాంతం వరకు ఆ పదవిలోనే కొనసాగారు. స్వాతంత్రోద్యమ కాలంలోనే ఒక్క కడప జిల్లాలోనే 200పైగా గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి . ఇది కడప జిల్లా గ్రంథాలయ ఉద్యమ చరిత్ర.

Read Also: కియా మోటార్స్

గ్రంథాలయ ఉద్యమానికి బీజం వేసిన కడజిల్లాకి గ్రంథాలయం అంటే ఏంటో తెలియదని పవన్ కల్యాణ్ అంటున్న మాటలు కచ్చితంగా ఆక్షేపణీయం, ఎందరో మహా మహులు , విద్యావంతులు ఎంతో పోరాడి గ్రంథాలయాలను 100 ఏళ్ళ నాడే ఏర్పాటు చేస్తే, ఆ చరిత్రని తప్పు దోవ పట్టించేలా పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతాన్ని పూర్తిగా ఆటవికులుగా, కౄరులుగా, భయోత్పాతం కలిగించేరాక్షసులుగా ఎందుకు పదే పదే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు? రాజకీయ స్వలాభం కోసం ఒక ప్రాంతంపై ఇంత విషం చిమ్మటం ఎంతవరకు సబబు? పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివారని మీడియా ప్రతినిధులు అందరుకలిసి రాజకీయ స్వలాభం కోసం మేధావిగా చిత్రికరించారు. ఇప్పుడు ఆ మేధావి చెబుతున్న మాటలు ఒక గొప్ప చరిత్రనే మింగేసే విధంగా ఉన్నాయి. ఇప్పటికే సీమ కళా వైభవాన్ని కాసుల కోసం చంపేసిన సినిమాలు ఉండగా, ఇప్పుడు రాజకీయాల పేరుతో పవన్ కళ్యాణ్ సీమని ఒక రాక్షస రాజ్యంగా చూపే ప్రయత్నం మొదలు పెట్టారు, ఇది సమాజంలో ప్రాంతాల మధ్య తీవ్ర అంతరాలకు బీజం అవుతుంది అనడంలో సందేహం లేదు, సీమకి వస్తే మాట్లాడాల్సింది పౌరుషాల గురించి కాదు, సాహిత్యం గురించి , దాని వైభవం గురించి. కడపకు గ్రంథాలయం తెలియకపోవటం కాదు కడపే ఒక గ్రంథాలయం అని చెబుతున్న చరిత్రని మరొకసారి చదివి మాట్లాడాలి పవన్ కల్యాణ్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp