పవన్ సౌభాగ్య దీక్ష

By Amar S Dec. 12, 2019, 07:56 am IST
పవన్ సౌభాగ్య దీక్ష

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గురువారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రైతు సౌభాగ్య దీక్ష చేపట్టనున్నారు. కాకినాడ జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో జనసే న ఏర్పాట్లు చేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి బకాయిలు చెల్లించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనే డిమాండ్లపై పవన్‌ దీక్ష చేస్తున్నారు.

గురువారం ఉదయం కాకినాడ జీఆర్‌టీ హోటల్‌ నుంచి పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబుతో కలసి పవన్‌ దీక్షా ప్రాంగణానికి చేరుకుని 8 గంటలకు దీక్ష ప్రారంభిస్తారు. ఈ దీక్ష 12 గంటలపాటు పవన్ చేయనున్నారు. భారీఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరవనున్నారు. పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆయన ఈ దీక్షకు గైర్హాజరవుతున్నారు.

మరో వైపు ,ఈ రోజు రైతుల గిట్టుబాటు ధర ప్రకటిస్తామని గత వారం ప్రభుత్వం ప్రకటన చేసింది.ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో పవన్ దీక్ష చేయటం రాజకీయ పబ్లిసిటీ కోసమేనన్న వాదన వినిపిస్తుంది.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp