కెమేరా మేన్ గంగతో రాంబాబు

By Ravoori.H Dec. 10, 2019, 07:58 am IST
కెమేరా మేన్ గంగతో రాంబాబు

సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూపించిన హీరోయిజం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీస్‌గా పవన్ కనిపిస్తే రూల్స్ అన్నీ అడ్డుతప్పుకుంటాయి. కోటీశ్వరుడిగా కనిపిస్తే రైల్వేస్టేషన్‌ని కూడా కొనెయ్యగలడు. అలాగే తనది ఎంత చిన్న స్థాయి అయినా సరే ....ఏ స్థాయిలో ఉన్నవాడినైనా కాలర్ పుచ్చుకుని మరీ గట్టిగా పీకగలడు.

కెమేరా మేన్ గంగతో రాంబాబులో అప్రెంటిస్‌గా ఒక మీడియా ఛానల్‌లో జాయిన్ అయిన రోజే ఒక వింగ్‌కి హెడ్ స్థాయిలో ఉన్న ఎస్సార్కే(అలీ)అనే క్యారెక్టర్‌ని ఒక రేంజ్‌లో పీకుతాడు పవన్. ఆ సినిమాలో ఆ ఎస్సార్కే చేసే ప్రోగ్రాం మేలుకొలుపు కాన్సెప్ట్ ఏంటంటే సొసైటీలో ఏ సమస్యలూ లేకపోతే, ప్రజలు కాస్త ప్రశాంతంగా ఉంటే తనే ఇష్యూ క్రియేట్ చేసి రచ్చ చేసే రకం జర్నలిస్ట్ పాత్ర అది. ఏదో సినిమాలో బ్లైండ్ పీపుల్‌ని అవమానిస్తూ డైలాగ్ ఉందని చెప్పి బ్లైండ్ పీపుల్‌ని రెచ్చగొడతాడు. తానే పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తాడు ఆ ఎస్సార్కే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆ ఎస్సార్కే(అలీ) క్యారెక్టర్‌ని పిచ్చి పీకుడు పీకుతాడు. హీరోయిజం పండిస్తాడు. చూస్తూ ఉన్న ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటాడు.

కానీ అదే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్‌లో అలాంటి హీరోయిజానికి పూర్తి రివర్స్‌లో వ్యవహరిస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఆ సినిమాలో ఎస్సార్కేలాగే ఆంధ్రజ్యోతి హెడ్ ఆర్కే కూడా ఇప్పుడు జగన్ పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నాడని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అందుకే జగన్ గెలిచిన మరుక్షణం నుంచీ కూడా క్రిస్టియన్ మతం చుట్టూ వివాదాలు రేపుతారు, ఇష్యూ క్రియేట్ చేస్తారు అని అందరూ ఊహించినట్టుగానే ఇప్పుడు ఆర్కే ఆంధ్రప్రదేశ్ నాట మత చిచ్చు రెచ్చగొట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తూ ఉన్నాడని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కి వ్యతిరేకంగా ఊరూ పేరూ తెలియని వాళ్ళు కూడా మతం గురించి ఏదో ఒకటి మాట్లాడితే హెడ్‌లైన్స్‌గా ఆంధ్రజ్యోతి మీడియా హైలైట్ చేస్తూ ఉన్న విషయం కంటికి కనిపిస్తూ ఉన్నదే.

ఆర్కే గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అర్జెంట్‌గా జగన్‌ని సీటు నుంచి దించేసి తనకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు అన్ని రకాలుగానూ అండగా ఉండే చంద్రబాబును గద్దెనెక్కించడం ఎలా అని ఈ ఐదేళ్ళూ అహరహరం శ్రమిస్తాడనడంలో సందేహం లేదు. కానీ కాస్త మంచి రాజకీయాలే చేస్తాను అని చెప్పుకుంటూ ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మత రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తూ ఉండడం మాత్రం ఆయనపైన తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేస్తోందని పవన్ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఉల్లిపాయల రేటు గురించి ట్వీటు రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ అందులో కూడా మత మార్పిడులు అంటూ మత రాజకీయాలు, మతాల మధ్య చిచ్చు రేపే రాజకీయ కామెంట్స్ చేయడం ఆలోచనాపరులను విస్తుపోయేలా చేస్తోంది. ఆల్రెడీ హిందూ-ముస్లిం రాజకీయాలతోనే మన దేశం చాలా నష్టపోయింది. ఇక ఇప్పుడు హిందూ-క్రిస్టియన్ రాజకీయ రచ్చ కోసం జగన్ వ్యతిరేకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నాట ఆడుతున్న డేంజరస్ గేం పుణ్యమాని భవిష్యత్తరాలు ఎలాంటి ఫలితం అనుభవించాల్సి వస్తుందో అని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు.

కమాన్ పవన్.....వేల పుస్తకాలు చదివిన నాలెడ్జ్ ఉంటే సంకుచితంగా కుల, మత రాజకీయాలు చేయడం ఎంత వరకూ కరెక్ట్. నాయకుడిగా స్థాయిని పెంచుకునే రాజకీయాలు, పొలిటికల్‌గా కూడా సూపర్ హీరో అనే పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకునే రాజకీయాలు చేస్తే రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. జనసేన కూడా పార్టీగా నిలబడుతుంది పవన్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp