పాకిస్తాన్ పోలీసులకి పట్టుబడిన తెలు'గోడు'

By Kiran.G 19-11-2019 01:37 PM
పాకిస్తాన్ పోలీసులకి పట్టుబడిన తెలు'గోడు'

పాకిస్తాన్ లోకి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలతో ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేసారు. అందులో ఒక తెలుగు వ్యక్తి కూడా ఉన్నాడు. అతని పేరు ప్రశాంత్ అని విశాఖపట్నానికి చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అని,హైదరాబాద్ మరియు బెంగుళూరులో ఉద్యోగాలు చేసాడని పోలీసులు తెలిపారు. బెంగుళూరులో పని చేస్తున్న సమయంలో సహోద్యోగితో ప్రేమలో పడ్డాడని అది విఫలం కావడంతో మానసిక ఒత్తిడికి గురి అయ్యాడని, ఈక్రమంలోనే రాజస్థాన్ కి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్ ఎడారిలో గాలులు భీకరంగా వీస్తాయని, దానివల్ల ఇసుక తిన్నెలు వేరేచోటికి బదిలీ అవుతాయని అలాంటి సందర్భాల్లో, పాకిస్తాన్ సరిహద్దు కనిపించదని అలా కనిపించకపోవడం వల్లే పాకిస్తాన్ కి వెళ్లి ఉంటాడని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే రెండేళ్ల క్రితమే ఏప్రిల్ 29, 2017లో తన కుమారుడు ప్రశాంత్ కనబడం లేదన్న విషయాన్ని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశానని, తన కుమారుడు సంఘ విద్రోహి కాదని , ఢిల్లీ రాయబార కార్యాలయాన్ని తమ కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోమని కోరుతామని ప్రశాంత్ తండ్రి బాబురావు తెలిపారు. ప్రశాంత్ తో పాటుగా మధ్యప్రదేశ్ కి చెందిన, వారీలాల్ కూడా పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రశాంత్ కి వారీలాల్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటని, వారిద్దరికీ పరిచయం ఎలా కలిగిందన్న విషయాలు శోధించే పనిలో పడ్డారు పోలీసులు.

ఈనెల 14 న బహావుల్ పూర్ దగ్గర ప్రశాంత్ ని వారీలాల్ ని పాకిస్తాన్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. చోలిస్థాన్ లోకి పాస్పోర్ట్ వీసా లేకుండా ప్రవేశించేందుకు ప్రయత్నించారని, వీరిద్దరిపై పాకిస్తాన్ చట్టప్రకారం 334-4 సెక్షన్ కింద అభియోగాలు నమోదు చేసారు పాకిస్తాన్ పోలీసులు. కాగా ఇప్పటికే కులభూషణ్ యాదవ్ విషయంలో ఘర్షణ పడుతున్న భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య పరమైన సంబంధాల విషయంలో మరో వివాదానికి కారణమయ్యేలా ఈ సంఘటన కనిపిస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News