Ex MP Undavalli - పాకిస్తాన్ భారత్ లో భాగం కావాలి - ఉండవల్లి

By Voleti Divakar Nov. 28, 2021, 04:00 pm IST
Ex MP Undavalli - పాకిస్తాన్ భారత్ లో భాగం కావాలి - ఉండవల్లి

చిన్న వయస్సులో బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత సైద్ధాంతికంగా సంస్థతో తీవ్రంగా విభేదించారు . ఇప్పటికీ ఆయన బిజెపి విధానాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తారు . ఆర్టికల్ 370, సి ఏ ఏ, పెద్దనోట్ల రద్దు, బీజేపీ హిందుత్వ విధానాలను ఉండవల్లి తీవ్రంగా దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ చీఫ్ , ప్రధాని నరేంద్రమోడీని అభినందించడం విశేషం .

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయాలతో ఆయన ఏకీభవించారు . రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయాన్ని కూడా ఉండవల్లి అభినందించారు . అదే సమయంలో సిఏఏ , పెద్దనోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాల గురించి కూడా ఆలోచించాలని కోరారు . ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన హిందుత్వ లో దేశ ముస్లింలు కూడా భాగమని , హిందూ , ముస్లింల డిఎన్ఏ ఒక్కటే అని స్పష్టం చేశారట. భగవత్ వ్యాఖ్యలను ఉండవల్లి స్వాగతించారు .

పాకిస్తాన్ సహా , తజకిస్తాన్ , కిర్గిజిస్తాన్ వంటి చివర స్తాన్ పేర్లు కలిగిన దేశాలన్నీ ఒకప్పుడు విశాల హిందుస్థాన్ లోభాగమని ఏనాటి నుంచో ఆర్ఎస్ఎస్ వాదిస్తోంది . వాటితో కలుపుకుని విశాల హిందుస్థాన్ ను పునర్నిర్మించాలన్నది ఆర్ఎస్ఎస్ చిరకాల సంకల్పం .

ఉండవల్లి మరో అడుగు ముందుకు వేసి భారత్ , పాకిస్తాన్ ల మధ్య శాంతి చర్చలు జరిపి ఇరుదేశాలను మళ్లీ కలిపేయాలన్నారు . తద్వారా కాశ్మీర్ , తీవ్రవాద సమస్యలు పరిష్కారమవుతాయన్నారు . పాకిస్తాన్ ఒకప్పుడు భారత్లో భాగమని దివంగత ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ కూడా చెప్పారని ఉండవల్లి గుర్తుచేశారు . ఈ విధంగా ఉండవల్లి , ఆర్ఎస్ఎస్ ఒక విషయంలో ఏకాభిప్రాయానికి రావడం విశేషం.

Also Read : New Districts- కొత్త జిల్లాలు ఎన్ని? ఎప్పుడు? సీఎం ప్రకటన తర్వాత మరోసారి చర్చ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp