OTS నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోండి… బాబుకు దొంగ ప్రేమెందుకో?

By Balu Chaganti Dec. 06, 2021, 10:15 pm IST
OTS నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోండి… బాబుకు దొంగ ప్రేమెందుకో?

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాంటి పథకం తీసుకురావాలన్నా , ఎలాంటి మంచి పని చేయాలన్నా ప్రతిపక్షాలకు భయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రజలకు మంచి జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కాకుండా వాళ్లకు మంచి జరిగితే జగన్ ను గుండెల్లో పెట్టేసుకుంటారు అనే భయంతో వాళ్లకు ఎలాంటి పథకాన్ని తీసుకొచ్చినా వాటిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాటిలో లోపాలను వెతికి ప్రజలకు దూరం చేసేందుకు చూస్తున్నారు తప్ప ప్రజలకు ఈ పథకాల వల్ల ఉపయోగం ఉంటుంది అనే విషయం మీద ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పుడు అందులో భాగంగా ప్రజలకు మంచి చేకూర్చాలని ఉద్దేశంతో 14 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం కి తెలుగుదేశం పార్టీ మోకాలడ్డుతోంది.

ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కేవలం ప్రజలను ఇబ్బందుల పాలు కాకుండా చేసేందుకు తీసుకు వచ్చామని జగన్ ప్రభుత్వం చెబుతుంటే తెలుగుదేశం పార్టీమాత్రం ఇది ప్రభుత్వం ప్రజలందరి మెడలకు బిగిస్తున్న ఉరితాడు అని ,మేము అధికారంలోకి వస్తే పూర్తిగా ఫ్రీగా ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చార్జీలతో కలిపి మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తామని చెబుతున్నారు. ఇది పూర్తిగా ప్రజలను డైవర్ట్ చేసే వ్యవహారమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే నిజంగా చంద్రబాబు ప్రజల మీద అంత ఆసక్తి ఉంటే ఎప్పటి నుంచో ఉన్న ఈ స్కీంను ప్రజలకు అందుబాటులో ఎందుకు తీసుకు రాలేదో చెప్పాల్సి ఉంటుంది. తన స్కీంను ప్రజలకు ఉపయోగపడేలా చేస్తే బాబు ఓర్వలేకున్నారు. ఎందుకంటే వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ అనేది ఇప్పుడు మొదలైన స్కీమ్ కాదు 2000 సంవత్సరంలో ఈ స్కీంను ప్రారంభించారు. చంద్రబాబు హయాంలోనే మొదలైన ఈ స్కీం కింద అప్పట్లో ప్రభుత్వం కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేసేది.

Also Read : Chandrababu, OTS - ఓటీఎస్‌పై బాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు..?

అయితే అలా కూడా 2000 సంవత్సరం నుంచి మార్చి 31 2014 వరకు అంటే 14 ఏళ్ల వ్యవధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2,31,284 మంది ఈ స్కీమ్ వినియోగించుకున్నారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు ఉ విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారో ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ మూలనపడింది. ఈ స్కీంను పొడిగించమని ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఈ విషయం కూడా ఆయన దృష్టికి రావడంతో గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన స్కీం కంటే మెరుగైన దీంతో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం అని అప్పుడే ఆయన మనసులో బీజం పడింది.

అలా సుమారు 40 లక్షల మంది రుణం తీసుకున్న లబ్ధిదారులకు మంచి చేకూర్చాలని ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో పది వేలు, పట్టణ ప్రాంతాల్లో 15000, కార్పొరేషన్ ప్రాంతాలలో 20,000 రూపాయలతో ఈ పథకం ప్రకారం లబ్ధిదారులు ముందుకు వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వ పట్టా కింద ఉన్న ఆస్తులను ప్రైవేటు ఆస్తులుగా గుర్తిస్తూ రిజిస్ట్రేషన్ చేసిచ్చే పధకాన్ని రూపొందించారు. అయితే ఎక్కడా ఇది నిర్బంధం అని చెప్పలేదు. ఒక చోట అలా నిర్బంధంగా  చేయడానికి ప్రయత్నించిన ఒక వీఆర్వోని ప్రభుత్వం అప్పటికప్పుడు తొలగించింది కూడా.. అయినా సరే చంద్రబాబు ఈ పథకం మీద పదేపదే విషం కక్కుతూ ఉండడంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు సజ్జల రామకృష్ణా రెడ్డి, బోత్స సత్యనారాయణ వంటివారు మీడియా ముఖంగా ఈ విషయం మీద పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఓటీఎస్‌ నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని.. ఇది పూర్తిగా ప్రజల ఇష్టానికే వదిలేశామని క్లారిటీ ఇచ్చారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు. అలాగే ఓటీఎస్‌పై ఎవరూ బలవంతం పెట్టడం లేదని, స్వచ్చందంగా లబ్ధిదారుల నిర్ణయం మేరకే చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Also Read : TDP, OTP Scheme, Chandrababu - ఓటీఎస్‌కు ఆటంకాలు రాబోతున్నాయా..? చంద్రబాబు వ్యాఖ్యల ఆంతర్యమేమిటి..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp