ఉల్లి ఘాటుకు ఉపశమనం

By Kotireddy Palukuri Dec. 13, 2019, 09:07 am IST
ఉల్లి ఘాటుకు ఉపశమనం

ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది. కోయక ముందే కన్నీళ్లు పెట్టిస్తోంది. అమాంతం పెరిగిన ధరతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆంద్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ప్రజలను ఉల్లి కష్టాల నుంచి బయట పడేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రైతు బజార్లలో కిలో 25 రూపాయల చొప్పున విక్రయాలు చేపట్టింది.

ఉల్లి ధరల నుంచి ప్రజలకు మరింత ఉపశమనం కలిగించేందుకు ఆంద్రప్రదేశ్ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లతో పాటు ఇకపై మార్కెట్ యార్డుల్లోనూ ఉల్లిని విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నేడు శుక్రవారం నుంచి విక్రయాలు ప్రారంభించనుంది.

కిలో ఉల్లి ని 125 రూపాయలకు కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై 25 రూపాయలకు అందిస్తోంది. 101 రైతు బజారుల్లో 35 రోజులుగా విక్రయాలు చేపడుతోంది. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ఈజిప్ట్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. ఈ నెల 14, 15 తేదీల్లో సరుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ తమకు 2100 టన్నుల ఉల్లి కావాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. ఆ మొత్తం వస్తే మరింత ఊరట లభించనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp