జనాభా లెక్కలు నిరవధిక వాయిదా

By iDream Post Mar. 25, 2020, 04:33 pm IST
జనాభా లెక్కలు నిరవధిక వాయిదా

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందడంతో ఇప్పటికే ప్రధాని వచ్చే ఏప్రిల్ 14 వరకు దేశంలో అన్నీ సర్వీసులు రద్దు చేస్తు లాక్ డౌన్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు రాబోయే 21 రోజులు ఇళ్ళు దాటి బయటికి రావద్దు అని విజ్ఞప్తి చేశారు. ఈ 21 రోజులు ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే కరోనా వైరస్ చైన్ ని బద్దలకొట్టగలగుతామనే ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏప్రిల్ 1 నుండి జరగవలసిన జనాభా లెక్కల (ఎన్.పి.ఆర్) ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేస్తునట్టు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జనాభా లెక్కల ప్రక్రియ ఉండదని స్పష్టం చేసింది. కరోనా ప్రబలిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్టు చెప్పింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అధికారులు నేడు ఒక ప్రకటన విడుదల చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp