నమ్ముకున్న వారికి న్యాయం ..... నామినేటెడ్ పదవులతో గోదావరి జిల్లాల నాయకుల్లో ఆనందం

By Voleti Divakar Jul. 17, 2021, 04:30 pm IST
నమ్ముకున్న వారికి న్యాయం ..... నామినేటెడ్ పదవులతో గోదావరి జిల్లాల నాయకుల్లో ఆనందం

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నమ్ముకున్న వారెవరూ నష్టపోలేదు . ఆయన తన వర్గం వారి కోసం అవసరమైతే ఎంతవరకైనా వెళ్లేవారు . ప్రత్యర్థులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన విధేయులకు పార్టీ పదవులు , టిక్కెట్లు , పదవులు ఇచ్చి న్యాయం చేశారు . దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు , మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు .

వైఎస్సార్ తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడానమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో తండ్రి బాటనే అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది . తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల పందేరమే ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు . పార్టీ ఆవిర్భావం నుంచి వ్యయప్రయాసలకు ఓర్చి తన వెంట నడిచిన నాయకులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టి గుర్తింపు , గౌరవం కల్పించారు . తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 16 మంది నాయకులు , పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 12 మంది వైసిపి నాయకులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు . ఇందులో తూర్పుగోదావరికి చెందిన నలుగురికి , పశ్చిమగోదావరికి చెందిన ఆరుగురికి రాష్ట్రస్థాయి పదవులు కల్పించారు . పదవుల పంపకంలో కూడా అన్ని వర్గాలకు సమప్రాతినిధ్యం కల్పించి , న్యాయం చేయడం విశేషం .

ఆకుల ఆనందం..

నేటి రాజకీయ విన్యాసాలు తెలియని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్‌సిపి మాజీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు . దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు అత్యంత సన్నిహితుడైన ఆకుల వీర్రాజు 2014,2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా రాజమహేంద్రవరం రూరల్ నుంచి పోటీ చేసి బుచ్చయ్య చౌదరి పై ఓడిపోయారు. ఆయనను ఇటీవల రూరల్ కోఆర్డినేటర్ పదవి నుంచి కూడ తప్పించారు . అయినా ఆకుల వీర్రాజు జగన్ పై నమ్మకంతో పార్టీలోనే కొనసాగుతూ ప్రజల్లో తిరిగారు . వీర్రాజు నమ్మకాన్ని వమ్ము చేయకుండా డిసిసి బ్యాంకు చైర్మన్‌గా నియమించి , జగన్ ఆయనకు న్యాయం చేశారు . ' నాకు తగిన గుర్తింపు , గౌరవం కల్పించిన జగను కు కృతజ్ఞతలు ' అంటూ ఆకుల ఆనందం వ్యక్తం చేశారు .

Also Read : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి.. యువత లో జోష్..

దొరబాబుకు రాష్ట్ర స్థాయి పదవి..

ప్రవాసాంధ్రుడైన పెద్దాపురం వైసిపి కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పెద్దాపురం నుంచి 2004 , 2009 లో కాంగ్రెస్ టిక్కెట్టును , 2019 లో వైసిపి టిక్కెట్టును ఆశించారు . గత ఎన్నికల్లో దొరబాబుకే దాదాపు వైసిపి టిక్కెట్టు ఖరారైంది . చివరి నిమిషంలో మాజీ మంత్రి తోట నరసింహం సతీమణి తోట వాణి టిక్కెట్టు పొందారు . అయినా నిరాశ చెందని దొరబాబు గత మున్సిపల్ ఎన్నికల్లో తన తల్లితో పాటు , పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించి , పెద్దాపురం మున్సిపాలిటీలో వైసిపి పతాకాన్ని ఎగురవేశారు . ఆయన కృషిని గుర్తించిన వైఎస్ జగన్ తాజా నామినేటెడ్ పదవుల్లో ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చి న్యాయం చేశారు .

రాజేశ్వర రావు కు గౌరవం..

ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి 2014 , 2019 లో రాజోలు నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావును పంచాయితీరాజ్ , రూరల్ డెవలప్మెంట్ , వాటర్ సప్లై బోర్డు సలహాదారుగా నియమించి , గుర్తింపును ఇచ్చారు . ఆది నుంచి పార్టీకి అండగా నిలుస్తున్న కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించారు . పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజుకు ఎపి క్షత్రియ వెల్ఫేర్ , డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవిని కల్పించి , గౌరవించారు జగన్ .

Also Read : విశ్వసనీయతకే పట్టం, విధేయులకే పదవులు

పదవులు పొందిన నేతలు.. తూర్పు గోదావరి జిల్లా ..

- దవులూరి దొరబాబు ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్

- కుడిపూడి సత్య శైలజా దృశ్యకళల అకాడమీ చైర్మన్ టి ప్రభావతి సైన్స్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్

- ద్వారంపూడి భాస్కర్ రెడ్డి సివిల్ సప్టిస్ కార్పొరేషన్ చైర్మన్

- బొంతు రాజేశ్వరరావు పిఆర్ , ఆర్.డి , రూరల్ వాటర్ సప్లై బోర్డు సలహాదారు

- ఆకుల వీర్రాజు - డిసిసిబి చైర్మన్

- మేడపాటి షర్మిలారెడ్డి రుడా ఛైర్మన్

- చందన నాగేశ్వర్ రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ చైర్మన్

- ఆళ్ల రాజబాబు కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్

- కాశి మునికుమారి హితకారిణీ సమాజం చైర్మన్

- తోలాడ శైలజ పార్వతి ఏలేశ్వరం డెవలప్మెంటుబోర్డు

- దూలం పద్మ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

- రాగిరెడ్డి దీప్తికుమార్ కుడా చైర్మన్

- సాకా మణికుమారి డిసిఎంఎస్ చైర్మన్

- గిరిజాల రామకృష్ణ తులసి రాజమ హేంద్రవరం అర్బన్ బ్యాంకు చైర్మన్

- ఏడిద చక్రపాణిరావు ఈస్ట్రన్ డెల్టా బోర్డు చైర్మన్

- కుడిపూడి వెంకటేశ్వర్ - సెంట్రల్ డెల్టా బోర్డు చైర్మన్

పశ్చిమగోదావరి..

- వెంకట రవీంద్రనాధ్ ఎపి ఎంఎస్ఎం డెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్

- దయాల నవీన్ బాబు ఎపి లేబర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్

- పాత పాటి సర్రాజు ఎపి క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్

- బర్రి లీలా ఎపి కనీస వేతనాల బోర్డు చైర్మన్

- పిల్లంగొల్ల శ్రీలక్ష్మి సాహిత్య అకాడమీ చైర్మన్

- కనుమూరి సుబ్బరాజు ఎపి రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్

- మధ్యాహ్నవు ఈశ్వరి ఏలూరు అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ చైర్మన్

- చిర్ల పద్మశ్రీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

- గంజిమళ్ల దేవి వెస్ట్రన్ డెల్టా బోర్డు చైర్మన్

- వేండ్ర వెంకటస్వామి డిసిఎంఎస్ చైర్మన్

- బొద్దాని అఖిల ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్

- పివిఎల్ నరసింహరాజు డిసిసిబి చైర్మన్

Also Read : నామినేటెడ్ పోస్టులోనూ జగన్ పంథా మారలేదు.. అదే పద్ధతి అవలంభించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp